Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni530d8013-7ff0-42b1-b21c-08eca73fead7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni530d8013-7ff0-42b1-b21c-08eca73fead7-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే వస్తుంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ధోని మాత్రం వరుసగా ఐపీఎల్లో కొనసాగుతూనే వస్తూ ఉన్నాడు. ఇకపోతే2024 ఐపీఎల్ సీజన్లో కూడా ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ చర్చ జరుగుతుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే.. ఇక ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు చెన్నై కెప్టెన్ గా కొనDhoni{#}bhavana;INTERNATIONAL;MS Dhoni;Chennai;Punjabధోని ఇలా చేస్తే.. ఇక CSK కి ఏం ఉపయోగం?ధోని ఇలా చేస్తే.. ఇక CSK కి ఏం ఉపయోగం?Dhoni{#}bhavana;INTERNATIONAL;MS Dhoni;Chennai;PunjabTue, 07 May 2024 09:30:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే వస్తుంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ధోని మాత్రం వరుసగా ఐపీఎల్లో కొనసాగుతూనే వస్తూ ఉన్నాడు. ఇకపోతే2024 ఐపీఎల్ సీజన్లో కూడా ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ చర్చ జరుగుతుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే.. ఇక ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు చెన్నై కెప్టెన్ గా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోని ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.


 అదే సమయంలో ఇక ఋతురాజ్ గైక్వాడ్ కి కొత్త కెప్టెన్ గా నియమించి జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక అభిమానుల కోసం మరోసారి మెరుపు బ్యాటింగ్ ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది ఋతురాజ్ కెప్టెన్సీలో అటు చెన్నై సూపర్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై జట్టు మరోసారి టైటిల్ గెలిచేలాగే కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ధోని తీరుపై మాత్రం కొంత విమర్శలు వస్తున్నాయి. ధోని చివర్లో వచ్చి సిక్సర్ ఫోర్ లతో చెలరేగిపోయి మెరుపులు మెరూపించడం అభిమానులకు నచ్చుతుంది.


 కానీ ప్రతి మ్యాచ్లో కూడా చాలా ఆలస్యంగా బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు . ఇక ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని ఏకంగా తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి డకౌట్ గా వెనుతిరిగాడు. ఇక ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ విమర్శలు గుప్పించాడు. ధోని లాంటి ఆటగాడు తొమ్మిదవ స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేయడం చెన్నైకి ఏమాత్రం మంచిది కాదు. అందుకే కొంత ముందు వచ్చి ధోని కనీసం నాలుగైదు ఓవర్లైన ఆడాలి. చివరి రెండు ఓవర్లు ఆడితే జట్టుకు ఎలాంటి లాభం ఉండదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్. అయితే అటు మహేంద్రుడి అభిమానులు కూడా ఇదే కోరుకుంటూ ఉండడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>