PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu--years-in-politics-never-been-so-bad34fd6c45-9022-4b77-a35c-53c89acbb866-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu--years-in-politics-never-been-so-bad34fd6c45-9022-4b77-a35c-53c89acbb866-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి సరిగ్గా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. సరిగ్గా ఎన్నికల సమయంలో పేదల పథకాలపై కత్తి వేలాడుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం కుట్రల వల్లే పేదల ఖాతాలలో నగదు జమ కావడం లేదని వైసీపీ నేతలు చెప్పడంతో పాటు కొన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నారు. ఈసీ జోక్యం వల్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ (విద్యాదీవెన), ఇన్ పుట్ సబ్సిడీ (రైతు భరోసా) నిధుల జమకు బ్రేక్ పడింది. chandrababu{#}Drought;Katthi;Election Commission;CBN;Andhra Pradesh;Jagan;Telugu Desam Party;Hanu Raghavapudi;TDP;YCP;Electionsఏపీలో పథకాలు ఆగిపోవడానికి బాబే కారణమా.. ఆ ఫిర్యాదు వల్లే ఆపేశారా?ఏపీలో పథకాలు ఆగిపోవడానికి బాబే కారణమా.. ఆ ఫిర్యాదు వల్లే ఆపేశారా?chandrababu{#}Drought;Katthi;Election Commission;CBN;Andhra Pradesh;Jagan;Telugu Desam Party;Hanu Raghavapudi;TDP;YCP;ElectionsTue, 07 May 2024 12:40:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి సరిగ్గా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. సరిగ్గా ఎన్నికల సమయంలో పేదల పథకాలపై కత్తి వేలాడుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం కుట్రల వల్లే పేదల ఖాతాలలో నగదు జమ కావడం లేదని వైసీపీ నేతలు చెప్పడంతో పాటు కొన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నారు. ఈసీ జోక్యం వల్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ (విద్యాదీవెన), ఇన్ పుట్ సబ్సిడీ (రైతు భరోసా) నిధుల జమకు బ్రేక్ పడింది.
 
తెలంగాణలో నష్టపోయిన రైతులకు నగదు బదిలీకి అనుమతులు ఇచ్చిన ఈసీ ఏపీలో మాత్రం అనుమతులు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు వల్లే ఈ పథకాలు ఆగాయని బాబు, టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు వల్లే నగదు జమ కాలేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు పసుపు కుంకుమ స్కీమ్ ను ప్రకటించినా ఆ స్కీమ్ కు వైసీపీ అడ్డు పడలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
 
టీడీపీ నేతల ఫిర్యాదు వల్ల పింఛన్లకు సంబంధించి వృద్ధులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జగన్ పథకాలు అమలైతే ఇబ్బంది అని భావించి విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా చంద్రబాబు ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు పేదలపై పగబట్టాడని పేదల విషయంలో జులుం ప్రదర్శిస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి సైతం చంద్రబాబు మోకాలడ్డుతుండటంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోవడంతో రైతుల ఆవేదన అంతాఇంతా కాదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పథకాల అమలు విషయంలో ఇబ్బందులు పెడుతూ ఏపీ ఓటర్లకు శత్రువు అవుతున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>