PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kurnooladece77f-b02b-454c-935f-d257045e6382-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kurnooladece77f-b02b-454c-935f-d257045e6382-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్న సర్వేలలో సైతం కర్నూలు జిల్లాలో వైసీపీకి తిరుగులేదని ఇక్కడ వైసీపీదే విజయమని వెల్లడవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు రాగా ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ మరోసారి సత్తా చాటడం ఖాయమని తేలిపోయింది. కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. kurnool{#}KANGATI SREEDEVI;pattikonda;Raghavendra;bharath;Sri Bharath;Sridevi Kapoor;sathish;Kurnool;District;YCP;Assembly;Reddy;Yevaru;war;TDP;media;Hanu Raghavapudi;Bharatiya Janata Partyసర్వే ఏదైనా కర్నూలులో గెలుపు ఆ పార్టీదే.. జిల్లాలో ఆ పార్టీకి తిరుగులేదా?సర్వే ఏదైనా కర్నూలులో గెలుపు ఆ పార్టీదే.. జిల్లాలో ఆ పార్టీకి తిరుగులేదా?kurnool{#}KANGATI SREEDEVI;pattikonda;Raghavendra;bharath;Sri Bharath;Sridevi Kapoor;sathish;Kurnool;District;YCP;Assembly;Reddy;Yevaru;war;TDP;media;Hanu Raghavapudi;Bharatiya Janata PartyTue, 07 May 2024 09:40:00 GMTకర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్న సర్వేలలో సైతం కర్నూలు జిల్లాలో వైసీపీకి తిరుగులేదని ఇక్కడ వైసీపీదే విజయమని వెల్లడవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు రాగా ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ మరోసారి సత్తా చాటడం ఖాయమని తేలిపోయింది. కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
 
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి టీజీ భరత్ వైసీపీ నుంచి ఎం.డి.ఇంతియాజ్ పోటీ చేస్తుండగా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండనుంది. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కోడుమూరు నియోజకవర్గంలో కూటమి నుంచి బొగ్గుల దస్తగిరి, వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తుండగా ఈ నియోజకవర్గంలో వైసీపీదే గెలుపు అని సర్వేల ద్వారా వెల్లడవుతోంది.
 
మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి తరపున రాఘవేంద్ర రెడ్డి వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి పోటీ చేస్తుండగా బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని తెలుస్తోంది. పత్తికొండ నియోజకవర్గం నుంచి కూటమి తరపున కేఈ శ్యాంబాబు, వైసీపీ తరపున కంగాటి శ్రీదేవి పోటీ చేస్తుండగా ఓటర్లు శ్రీదేవి వైపు మొగ్గు చూపుతున్నారని ఆమెనే గెలిపిస్తారని తెలుస్తోంది.
 
ఆదోని నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పీ.వీ పార్థసారథి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి వై. సాయిప్రసాద్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సాయిప్రసాద్ రెడ్డి సులువుగానే గెలుస్తారని ఆయన గెలుపు విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని భోగట్టా. ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డి బరిలో నిలవగా వైసీపీ నుంచి బట్టా రేణుక బరిలో ఉన్నారు.
 
ఈ ఎన్నికల్లో బుట్టా రేణుకకు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బుట్టా రేణుక ఈ ఎన్నికల్లో సత్తా చాటడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆలూరులో టీడీపీ కూటమి నుంచి వీరభద్ర గౌడ్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి విరూపాక్షి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వార్ వన్ సైడ్ అని వైసీపీదే విజయమని తెలుస్తోంది.
 
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కూటమి నుంచి నాగరాజు వైసీపీ నుంచి బీవై రామయ్య పోటీ చేస్తున్నారు. కర్నూలు ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>