MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood433b60ea-1949-4bd7-b290-4cccb33ea02a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood433b60ea-1949-4bd7-b290-4cccb33ea02a-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ టాలీవుడ్ కింగ్ నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన అన్షు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తన కెరీర్ మొత్తంలో ఈమె చేసింది నాలుగు సినిమాలు అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఆ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎందుకంటే మన్మధుడు రాఘవేంద్ర సినిమాల్లో ఈమె నటించిన తీరు ఆమె నటించిన విధానం ఆమె అందం అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పటికీ ఈ హీరోయిన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఊహించిన విధంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి tollywood{#}Akkineni Nagarjuna;anshu;sundeep kishan;Hyderabad;Tollywood;marriage;Director;News;Father;Ishtam;Raghavendra;Heroine;Hero;India;Teluguసందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు హీరోయిన్..!?సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు హీరోయిన్..!?tollywood{#}Akkineni Nagarjuna;anshu;sundeep kishan;Hyderabad;Tollywood;marriage;Director;News;Father;Ishtam;Raghavendra;Heroine;Hero;India;TeluguTue, 07 May 2024 16:20:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ టాలీవుడ్ కింగ్ నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన అన్షు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తన కెరీర్ మొత్తంలో ఈమె చేసింది నాలుగు సినిమాలు అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఆ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎందుకంటే మన్మధుడు రాఘవేంద్ర సినిమాల్లో ఈమె నటించిన తీరు ఆమె నటించిన విధానం ఆమె అందం అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పటికీ ఈ హీరోయిన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.

 అయితే ఊహించిన విధంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఇన్నేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ సినీ ఇండస్ట్రీకి రియంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే సందీప్ కిషన్ హీరోగా ధమాకా డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన కాంబినేషన్లో ఇటీవల ఒక సినిమాను ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎస్కే 30 వర్కింగ్ తో ప్రారంభించిన ఈ సినిమాలో అన్షును ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే తనకి డైరెక్టర్ వినిపించిన పాత్ర కూడా చాలా నచ్చింది అని.. పాత్రకి సంబంధించిన నరేషన్ ని కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తోంది.

 అన్ని కుదిరితే ఈ సినిమాతో అన్షు తన సెకండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేయబోతుందన్నమాట. కాగా ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా కనిపించే హీరోయిన్ ని మేకర్స్ ఇంకా ఎంపిక చేయలేదు. మరి ఆ పాత్రకి ఏ భామని అనుకుంటున్నారో చూడాలి.  ఇటీవలే మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చిన అన్షు.. తాను యాక్టింగ్ మానేయడానికి గల కారణం తెలియజేసారు. తన తండ్రి ఓవర్ ప్రొటెక్టీవ్‌ అవ్వడం వలనే సినిమాలకు గుడ్ బై చెప్పేసాను. కానీ నటించాలని ఆశ అలానే ఉంది. అందుకే మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చానని చెప్పుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>