MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రస్తుత తరం యంగ్ హీరోలలో రాజ్ తరుణ్ సీనియర్ ‘ఉయ్యాల జంపాల’ మూవీ సక్సస్ తో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన ఈ హీరో ఆతరువాత కొన్ని హిట్స్ అందుకున్నప్పటికీ ఆపై వచ్చిన అతడి సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారడంతో అతడి కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం అతడు చేసిన సినిమాలను కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకురాని పరిస్థితులలో ఇతడితో సినిమాలు తీయడానికి చాలామంది దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సంవత్సరం విడుదలైన ‘నా సామిరంగా’ లో నాగార్జున పక్కన నటించిన అతడి పాత్రకు మంచి పేరRAJTARUN{#}maruti;K S Ravikumar;job;Raj Tarun;Industry;Akkineni Nagarjuna;Athadu;Darsakudu;Hero;Director;Cinemaఆశక్తిగా మారిన రాజ్ తరుణ్ యాక్షన్ ప్లాన్ !ఆశక్తిగా మారిన రాజ్ తరుణ్ యాక్షన్ ప్లాన్ !RAJTARUN{#}maruti;K S Ravikumar;job;Raj Tarun;Industry;Akkineni Nagarjuna;Athadu;Darsakudu;Hero;Director;CinemaTue, 07 May 2024 08:47:00 GMTప్రస్తుత తరం యంగ్ హీరోలలో రాజ్ తరుణ్ సీనియర్ ‘ఉయ్యాల జంపాల’ మూవీ సక్సస్ తో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన ఈ హీరో ఆతరువాత కొన్ని హిట్స్ అందుకున్నప్పటికీ ఆపై వచ్చిన అతడి సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారడంతో అతడి కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం అతడు చేసిన సినిమాలను కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకురాని పరిస్థితులలో ఇతడితో సినిమాలు తీయడానికి చాలామంది దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సంవత్సరం విడుదలైన ‘నా సామిరంగా’ లో నాగార్జున పక్కన నటించిన అతడి పాత్రకు మంచి పేరుతో పాటు విజయం కూడ లభించడంతో తిరిగి అతడి అదృష్టం కలిసి వచ్చింది. ఈ నేపధ్యంలో త్వరలో విడుదల కాబోతున్న ఇతడు నటించిన రెండు సినిమాలలో ఒక సినిమా హిట్ అయ్యే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు ఉన్నాయి.


ఈ రెండు సినిమాలలో మొదటిది ‘తిరగబడరా సామీ’ చాలకాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ బిజినెస్ పూర్తి అవ్వకపోవడంతో ఈమూవీ విడుదల చేయలేక పోతున్నారు. దీనికితోడు ఈసినిమాకు  ‘యజ్ఞం’ ఫేమ్ రవికుమార్ చౌదరి దర్శకుడు కావడంతో ఈమూవీ పై ఎటువంటి అంచనాలు లేవు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ యంగ్ హీరో నటించిన మరొక సినిమా’ భలే ఉన్నాడే’ మూవీ టీజర్ లేటెస్ట్ గా విడుదలైనది.  


అమ్మాయిలకు చీరలు కట్టే వెరైటీ ఉద్యోగం చేసే అబ్బాయిగా రాజ్ తరుణ్ ఈమూవీలో నటిస్తున్నాడు. ఈ ట్రైలర్ కు యూత్ నుంచి మంచి స్పందన వస్తోంది. దర్శకుడు మారుతీ నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో ఈమూవీ హిట్ అవుతుంది అన్న టాక్ ఉంది. ఈసినిమాలో ‘భలే భలే మగాడివోయ్’ ఛాయలు కనిపించే ఆస్కారం ఉంది అంటున్నారు. మారుతి పరపతితో ఈమూవీకి సంబంధించిన నాన్ థియేట్రికల్ ఓటిటి రైట్స్ అమ్మేయడంతో ఈమూవీ విడుదల కాకుండానే లాభాల బాట పట్టింది అన్న మాటలు వినిపిస్తున్నాయి..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>