MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీ తరువాత మరొక మూవీని తీయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పైన పట్టింది. కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ ను హీరోగా చేసి తీస్తున్న ఈమూవీలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీ మూల కథ కూడ రాజకీయ అవినీతి చుట్టూ తిరుగుతుందని అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఆమాటలకు బలం చేకూర్చే విధంగా ప్రస్తుతం అతడు తీస్తున్న ‘కుబేర’ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కనిపిస్తోంది. ఒక కంటైనర్ నిండా కట్టలు కట్టలు డబ్బు కనిపిస్తూ ఉంటే వర్షంలో తడుస్తున్న నాగార్జున ఒక గొsekhar kammula{#}dhanush;Thriller;Currency;Athadu;sekhar;Akkineni Nagarjuna;rana daggubati;Tollywood;Kollywood;Hero;Cinema;Director;India;News;Teluguలీడర్ ను ఆదర్శంగా తీసుకున్న కుబేర !లీడర్ ను ఆదర్శంగా తీసుకున్న కుబేర !sekhar kammula{#}dhanush;Thriller;Currency;Athadu;sekhar;Akkineni Nagarjuna;rana daggubati;Tollywood;Kollywood;Hero;Cinema;Director;India;News;TeluguMon, 06 May 2024 08:00:00 GMTసెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీ తరువాత మరొక మూవీని తీయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పైన పట్టింది. కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ ను హీరోగా చేసి తీస్తున్న ఈమూవీలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీ మూల కథ కూడ రాజకీయ అవినీతి చుట్టూ తిరుగుతుందని అన్నమాటలు వినిపిస్తున్నాయి.



ఆమాటలకు బలం చేకూర్చే విధంగా ప్రస్తుతం అతడు తీస్తున్న ‘కుబేర’ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కనిపిస్తోంది. ఒక కంటైనర్ నిండా కట్టలు కట్టలు డబ్బు కనిపిస్తూ ఉంటే వర్షంలో తడుస్తున్న నాగార్జున ఒక గొడుగు పట్టుకుని ఆ నోట్ల  కట్టల వైపు తీక్షణంగా చూస్తున్న నాగార్జునను చూసిన వారికి ‘లీడర్ మూవీలో   కరెన్సీ నోట్ల కట్టలతో నిండిపోయిన ఒక గదిలోని బీరువాలను చూసి షాక్  అయిన రానా పాత్రను గుర్తు చేసే విధంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  



చేతిలో రూపాయి లేని ధనుష్ వ్యవస్థలోని లోపాలను అడ్డు పెట్టుకునీ లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా అధిపతిగా మారాడు అన్న పాయింట్ చుట్టూ తిరిగే ఈ మూవీ కథలో నాగార్జున ఇంటలి జెంట్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ధనుష్ చీకటి రహస్యాలను వెలికి తీసే అధికారిగా నాగ్ ను కొత్త గెటప్ లో చాల డిఫరెంట్ గా శేఖర్ కమ్ముల చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.



పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ మూవీతో ధనుష్ డైరెక్ట్ తెలుగు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ధనుష్ నటించిన ‘సార్’ మూవీ తమిళంలో కంటే తెలుగులో బాగా సక్సస్ కావడంతో తెలుగు ప్రేక్షకులలో కూడ ధనుష్ పట్ల క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలలో ఒక వెరైటీగా శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీని తీస్తున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మూవీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వస్తున్నట్లు టాక్..  






 






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>