PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajandhra-pradesh33c5bf89-5628-443e-9cdf-5c935808193a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajandhra-pradesh33c5bf89-5628-443e-9cdf-5c935808193a-415x250-IndiaHerald.jpgప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నరసాపురానికి చెందిన ఈ నేత క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. నరసాపురంలో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు ప్ర‌సాద‌రాజు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న నరసాపురం అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. ప్రసాదరాజుకు ఉన్న ప్రజాదారణ కారణంగా ఇక్కడ జనసేన ఆయన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. Rajandhra Pradesh{#}Chiranjeevi;kalyan;Indian National Congress;Kshatriya;Janasena;Y. S. Rajasekhara Reddy;Assembly;TDP;YCP;narasapuram;Narsapur;Party;Congress;Indiaరాజాంధ్ర‌ప్ర‌దేశ్‌: న‌ర‌సాపురంలో వార్‌ వన్ సైడ్.. క్షత్రియులకు ఎప్పుడూ అడ్డానే..??రాజాంధ్ర‌ప్ర‌దేశ్‌: న‌ర‌సాపురంలో వార్‌ వన్ సైడ్.. క్షత్రియులకు ఎప్పుడూ అడ్డానే..??Rajandhra Pradesh{#}Chiranjeevi;kalyan;Indian National Congress;Kshatriya;Janasena;Y. S. Rajasekhara Reddy;Assembly;TDP;YCP;narasapuram;Narsapur;Party;Congress;IndiaMon, 06 May 2024 09:08:00 GMT• నరసాపురంలో మకుటం లేని మహారాజుగా నిలుస్తున్న ప్ర‌సాద‌రాజు  

• మెగా ఫ్యామిలీని చిత్తుచిత్తుగా ఓడించి సన్సేషనల్ అయ్యారు

• వేరే సామాజిక వర్గ ప్రజల మెప్పును పొందుతూ వరుస విజయాలు అందుకుంటున్నారు

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నరసాపురానికి చెందిన ఈ నేత క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. నరసాపురంలో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు ప్ర‌సాద‌రాజు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న నరసాపురం అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. ప్రసాదరాజుకు ఉన్న ప్రజాదారణ కారణంగా ఇక్కడ జనసేన ఆయన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

 2004లో కాంగ్రెస్ నుంచి మొదటిసారిగా ప్రసాదరాజు పోటీ చేశారు. ఆ సమయంలో కేవలం 3 వేల కోట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. 2009 నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్థిని 20వేల ఓట్ల తేడాతో ఓడించారు. నరసాపురం అనేది చిరంజీవి సొంత నియోజకవర్గం. ఇక్కడ చిరంజీవికి బాగా పేరు ఉంది అభిమానులు కూడా ఎక్కువే. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో అభిమానం ఇంకా ఎక్కువ ఉండేది. ముదునూరు ప్ర‌సాద‌రాజు ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజారాజ్యం అభ్యర్థిని సునాయాసంగా ఓడించి గెలుపొందారు.  అప్పట్లో ఆయన గెలుపు పెద్ద సంచలనం అయ్యింది.

ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2012లో వైసీపీకి వెళ్లి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయారు. 2014లో ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ నేత పితాని సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేసి జనసేన క్యాండిడేట్ బొమ్మిడి నాయకర్‌పై 6,436 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ముదునూరు ప్ర‌సాద‌రాజు గెలుపు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు ఎందుకంటే నరసాపురంలో క్షత్రియ సామాజిక వర్గం ప్రజలు ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ నియోజకవర్గం బీసీలకు, కాపులకు కంచుకోట. ఆయా సామాజిక వర్గ నేతలు ప్రత్యర్థులుగా నిలబడుతున్నాం వారిని ఓడిస్తూ 20 ఏళ్లుగా ఎదురులేని నాయకుడిగా ఆయన కొనసాగడం మామూలు విషయం కాదు. నరసాపురం అసెంబ్లీ సీటు ఎప్పుడూ క్షత్రియలకు అడ్డాగా ఉంటూ వస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>