MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini6956769d-5796-4bc2-a117-9181e0322d32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini6956769d-5796-4bc2-a117-9181e0322d32-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ తో తమిళ సినిమా ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రజిని ఆ తర్వాత తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రజనీ కీలక పాత్రలో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పrajini{#}Dilip Kumar;aishwarya;rana daggubati;Komaram Bheem;Rajani kanth;lyca productions;Industry;Blockbuster hit;Hero;News;Tamil;Music;Cinemaవెట్టైయాన్ : ఏకంగా అంత శాతం షూటింగ్ కంప్లీట్..?వెట్టైయాన్ : ఏకంగా అంత శాతం షూటింగ్ కంప్లీట్..?rajini{#}Dilip Kumar;aishwarya;rana daggubati;Komaram Bheem;Rajani kanth;lyca productions;Industry;Blockbuster hit;Hero;News;Tamil;Music;CinemaMon, 06 May 2024 14:06:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ తో తమిళ సినిమా ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రజిని ఆ తర్వాత తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రజనీ కీలక పాత్రలో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం రజిని , టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టైయాన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బిగ్ బి అమితా బచ్చన్ , రానా కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఓ కేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన 80% షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. మిగిలిన 20% షూటింగ్ ను కూడా చాలా త్వరగా పూర్తి చేసి ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం , జై భీమ్ లాంటి సినిమా తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>