MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhas48fcbab7-362c-493f-9a91-3bc58186eb87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhas48fcbab7-362c-493f-9a91-3bc58186eb87-415x250-IndiaHerald.jpgఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ సలార్ సినిమా ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం ఈ సినిమా క్లిక్కవ్వలేదు అనే టాక్ కూడా వచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 600+ కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇవి ఈ సినిమాకి వచ్చిన టాక్ కి చాలా తక్కువ. ఎందుకంటే ఫ్యాన్స్, చిత్ర యూనిట్ ఈ మూవీకి వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేశారు. ఆ టార్గెట్ నPrabhas{#}vegetable market;Shahrukh Khan;Kannada;krishnam raju;Prabhas;producer;Producer;Remake;Chitram;prashanth neel;Prasanth Neel;Cinemaసలార్ 2: నీల్ రిస్క్.. నిర్మాత నాట్ ఇంట్రెస్టెడ్?సలార్ 2: నీల్ రిస్క్.. నిర్మాత నాట్ ఇంట్రెస్టెడ్?Prabhas{#}vegetable market;Shahrukh Khan;Kannada;krishnam raju;Prabhas;producer;Producer;Remake;Chitram;prashanth neel;Prasanth Neel;CinemaMon, 06 May 2024 16:52:10 GMTఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ సలార్ సినిమా ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం ఈ సినిమా క్లిక్కవ్వలేదు అనే టాక్ కూడా వచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 600+ కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇవి ఈ సినిమాకి వచ్చిన టాక్ కి చాలా తక్కువ. ఎందుకంటే ఫ్యాన్స్, చిత్ర యూనిట్ ఈ మూవీకి వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేశారు. ఆ టార్గెట్ ని సలార్ సినిమా ఏమాత్రం కూడా రీచ్ కాలేకపోయింది. పైగా ఈ మూవీకి పోటీగా షారుఖ్ ఖాన్ లో బడ్జెట్ డంకీ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఇంపాక్ట్ కూడా సలార్ కలెక్షన్స్ పై పడింది. అదే సమయంలో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో ఫ్యాన్స్ ని మెప్పించినా కూడా పూర్తిస్థాయిలో ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు. ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ఉగ్రం సినిమానే సలార్ గా రీమేక్ చేశారనే టాక్ ప్రచారం అయ్యింది. బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఖాన్సార్ అనే ఒక ఫిక్షనల్ మాఫియా సిటీ క్రియేట్ చేసి ఆ బ్యాక్ డ్రాప్ లో సలార్ ని గ్రాండ్ స్కేల్ పై చూపించారు.


అది బాగానే ఉన్నా కానీ కన్నడంలో అయితే సలార్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఉగ్రం మూవీ రీమేక్ అని కన్నడ వాళ్ళు స్పష్టం చేసేసారు. సలార్ మూవీ సినిమా కేవలం నైజం, ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. మిగిలిన చోట్ల మాత్రం ఫ్లాప్ అయ్యింది.అయితే ఇప్పుడు సలార్ మూవీకి సీక్వెల్ గా శౌర్యంగ పర్వం తెరకెక్కించే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు. సలార్ మూవీ కంటే ఎక్కువ బడ్జెట్ ఖచ్చితంగా ఈ సీక్వెల్ కి పెట్టాల్సి ఉంటుందంట. సలార్ సినిమా ఏవరేజ్ కావడంతో సలార్ 2పై ప్రేక్షకులకి పెద్ద ఆసక్తి కనిపించడం లేదు.అందుకే భారీ బడ్జెట్  పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుదనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారట.అయితే సలార్ మూవీ క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా విడిచి పెట్టాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 కచ్చితంగా హై లెవెల్లో డిజైన్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. బడ్జెట్ విషయంలోనే దర్శక, నిర్మాతల మధ్య చర్చల కారణంగా మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందని టాక్. ఇదిలా ఉండగా  జులై 5 న సలార్ మూవీని జపాన్లో రిలీజ్ చేస్తున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>