Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5bfd7d91-3fe4-4e57-8702-bcfc82bb1505-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5bfd7d91-3fe4-4e57-8702-bcfc82bb1505-415x250-IndiaHerald.jpgసినిమాలను ఎంత ఇంట్రెస్ట్ గా అయితే చూస్తున్నారో.. అంతకంటే ఇంట్రెస్ట్ గా సిరీస్ లను చూస్తున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలో ఎన్నో సిరీస్ లను అనేక సీజన్స్ గా కొనసాగిస్తూనే ఉన్నారు.దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోను అనేక రకాల వెబ్ సిరీస్ లు అన్ని భాషలలో అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఆయా వెబ్ సిరీస్ ల అన్నీ సీజన్స్ ను ఆదరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాగా ఫేమస్ అయిన ఓ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రైమ్ వీడియో ఓ అప్ డేట్ ను రిలీజ్ చేసిsocialstars lifestyle{#}Good Newwz;Samantha;srikanth;Good news;monday;Wife;raj;september;Indian;Capital;priyamani;Amazon;Audienceది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లవర్స్ కు గుడ్ న్యూస్..!!ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లవర్స్ కు గుడ్ న్యూస్..!!socialstars lifestyle{#}Good Newwz;Samantha;srikanth;Good news;monday;Wife;raj;september;Indian;Capital;priyamani;Amazon;AudienceMon, 06 May 2024 19:45:00 GMTసినిమాలను ఎంత ఇంట్రెస్ట్ గా అయితే చూస్తున్నారో.. అంతకంటే ఇంట్రెస్ట్ గా సిరీస్ లను చూస్తున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలో ఎన్నో సిరీస్ లను అనేక సీజన్స్ గా కొనసాగిస్తూనే ఉన్నారు.దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోను అనేక రకాల వెబ్ సిరీస్ లు అన్ని భాషలలో అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఆయా వెబ్ సిరీస్ ల అన్నీ సీజన్స్ ను ఆదరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాగా ఫేమస్ అయిన ఓ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రైమ్ వీడియో ఓ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌'. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా వచ్చి అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు నమోదు చేసింది.స్పై, థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ను దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించింది. అయితే ఈ సిరీస్ మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్ అయినట్లు అమెజాన్ ప్రైమ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సోమవారం (మే 6) ఓ గుడ్ న్యూస్ చెప్పింది.ఇది చూసి రాశీ ఖన్నా, నీల్ నితిన్ ముకేశ్, శ్రేయ ధన్వంతరిలాంటి సెలబ్రిటీలు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైంది.ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 20, 2019లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చినా.. తర్వాత అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్ తివారీ అనే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఓవైపు, దేశాన్ని ఉగ్రవాదుల నుంచి కాపాడే స్పైగా మరోవైపు మనోజ్ బాజ్‌పాయి ఇందులో నటించాడు.

అతని భార్య సుచిత్రా తివారీ పాత్రలో ప్రియమణి నటించింది. తొలి రెండు సీజన్లలోనూ ఈ ఇద్దరి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలి సీజన్ మొత్తం కశ్మీరీ ఉగ్రవాదం, రాజధాని ఢిల్లీకి వాళ్ల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో సాగింది. ఇక రెండో సీజన్లో ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని చూపించారు. ఇందులో సమంత ఎల్టీటీఈ ఉగ్రవాదిగా నటించింది.రెండు సీజన్లూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాయి. రెండో సీజన్ ను ఈశాన్య భారతంలో ముగించారు. ఈసారి శ్రీకాంత్ తివారి యాక్షన్ నార్త్ ఈస్ట్ లో మొదలు కానుంది. ఈ కొత్త సీజన్ మోస్ట్ అవేటెడ్ ఇండియన్ వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచింది.షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తయితే కనుక.. త్వరలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>