PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/adithi-gajapathi-raju--vizianagaram8a0b9c5d-4f8f-47f9-b536-40df0aa24c66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/adithi-gajapathi-raju--vizianagaram8a0b9c5d-4f8f-47f9-b536-40df0aa24c66-415x250-IndiaHerald.jpg•గొప్ప రాజులుగా విజయనగరాన్ని ఏలిన పూసపాటి వంశీకులు •విజయనగరంలో వారసురాలిని గెలిపించుకోవాలని ఆరాట పడుతున్న అశోక్ గజపతి రాజు •ఎమ్మెల్యేగా గెలిచేందుకు సర్వ శక్తులు ఉపయోగిస్తున్న అదితి గజపతి రాజు విజయనగరం - ఇండియా హెరాల్డ్: విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీకులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎవరికీ లేవు. ఒకప్పుడు వారు సంస్థానాల ద్వారా ప్రజలను పాలించారు. గొప్ప రాజులుగా విజయనగరం చరిత్రలో నిలిచారు.తరువాత ప్రజాస్వామ్య యుగం వచ్చాక కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తమ ఆస్తులను కూడా Adithi Gajapathi Raju - Vizianagaram{#}ashok;Vijayanagaram;history;Survey;Service;Father;Vizianagaram;central government;king;Yevaru;Telugu Desam Party;Minister;Janasena;MLA;India;Venkateshవిజయనగరం: రాజ కుమార్తె రాజుల చరిత్రని నిలబెడుతుందా?విజయనగరం: రాజ కుమార్తె రాజుల చరిత్రని నిలబెడుతుందా?Adithi Gajapathi Raju - Vizianagaram{#}ashok;Vijayanagaram;history;Survey;Service;Father;Vizianagaram;central government;king;Yevaru;Telugu Desam Party;Minister;Janasena;MLA;India;VenkateshMon, 06 May 2024 10:17:39 GMT•గొప్ప రాజులుగా విజయనగరాన్ని ఏలిన పూసపాటి వంశీకులు
•విజయనగరంలో వారసురాలిని గెలిపించుకోవాలని ఆరాట పడుతున్న అశోక్ గజపతి రాజు
•ఎమ్మెల్యేగా గెలిచేందుకు సర్వ శక్తులు ఉపయోగిస్తున్న అదితి గజపతి రాజు


విజయనగరం - ఇండియా హెరాల్డ్: విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీకులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎవరికీ లేవు. ఒకప్పుడు వారు సంస్థానాల ద్వారా ప్రజలను పాలించారు. గొప్ప రాజులుగా విజయనగరం చరిత్రలో నిలిచారు.తరువాత ప్రజాస్వామ్య యుగం వచ్చాక కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తమ ఆస్తులను కూడా ప్రజలకు ఇచ్చేశారు.విజయనగరంలో అణువణువూ పూసపాటి వంశీకులదే. అదంతా కూడా తమ ప్రజల కోసం దారాదత్తం చేశారు. ఈ రోజులలో భూ కబ్జాలు చేస్తూ వందల ఎకరాలను తమ సొంతం చేస్తున్న తరం ఒక వైపు ఉంటే తమ విలువైన భూములను కూడా ఇచ్చేసిన ఉదారత్వం పూసపాటి రాజులది.ఇక కేంద్ర మాజీ మంత్రి అయిన అశోక్ గజపతిరాజు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. తన గత చరిత్రను వంశాన్ని ఆయన ఎన్నడూ కూడా చెప్పుకోలేదు. అలాగే ప్రజలు కూడా ఆయన్ని ఆదరించారు.


అయితే ఇప్పుడు ఈ ఎన్నికల రాజకీయాల్లో ఒక్క ఓటు తక్కువ వచ్చినా కూడా ఓటమే. అలా 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇక 2019లో ఎంపీగా ఉంటూ మరోసారి ఓడిపోయారు.అయితే ఆ ఓటమిని కూడా ఆయన పాజిటివ్ గానే తీసుకున్నారు. అయితే 2019లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు మొదటి సారి రాజకీయ అరంగేట్రం చేసి విజయనగరం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే ఆమె ఆ ఎన్నికల్లో దారుణంగా ఆరు వేల నాలుగు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఈసారి మళ్లీ ఆమెకే తెలుగుదేశం టికెట్ ఇచ్చింది. తండ్రి అశోక్ కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు.తన వారసురాలిని గెలిపించుకుని ఎమ్మెల్యేగా చూడాలని అశోక్ ఆరాటపడుతున్నారు. అందుకు తన అనుభవం అంతా ఆయన ఉపయోగిస్తున్నారు.


విజయనగరం ఎమ్మెల్యే సీటులో పీవీజీ రాజు అంటే అశోక్ తండ్రి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 1952, 1955లలో రెండు సార్లు విజయం సాధించారు. ఇక 1978 నుంచి అశోక్ గజపతిరాజు ఇదే సీటులో విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇపుడు ఆ వంశం మూడవ తరంలో అదితి గజపతి రాజు గెలిస్తే కనుక ఈ సీటు పూసపాటి వారి పరం అవుతుంది.లేకపోతే రాజుల చరిత్ర అలా రాజకీయంగా ముగిసినట్లే అవుతుంది. దాంతో ఈసారి విజయం కోసం సర్వ శక్తులూ అదితి గజపతిరాజు ఉపయోగిస్తున్నారు.టీడీపీకి జనసేన మద్దతు ఉండడంతో విజయం సాధ్యమని అదితి గజపతిరాజు మద్దతుదారులు గట్టి నమ్మకంగా ఉన్నారు.


అయితే ప్రత్యర్థి కోలగట్ల కూడా ధీటైన వారు. సామాన్యుడు కారు. పైగా ఆయన ప్రతీ ఇంటినీ ఒకటికి రెండు సార్లు చుట్టేస్తున్నారు. పిలిచిన పలికే ఎమ్మెల్యేగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు కూడా విజయనగరంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల బీసీలు ఖచ్చితంగా వైసీపీకి మద్దతు ఇస్తారు. మళ్లీ బంపర్ విక్టరీ కొడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.దీంతో విజయనగరం ఎమ్మెల్యే సీటుకు పోటా పోటీ తప్పదని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ద్వారా తెలుస్తుంది.అయితే ఎవరు గెలిచినా కూడా మెజారిటీ స్వల్పమే. మరి రాజు గారి కుమార్తె పూసపాటి చరిత్రని మళ్ళీ సృష్టిస్తుందో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>