EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/etv2d951929-1755-4ad0-acfe-c9f5412a2c79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/etv2d951929-1755-4ad0-acfe-c9f5412a2c79-415x250-IndiaHerald.jpgకొన్ని రోజులుగా టీడీపీ దాని అనుకూల మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేస్తున్న దుష్ర్పచారం అంతా ఇంతా కాదు. అయితే తమకు నచ్చిందే ప్రజలు నమ్మాలని ఎల్లో మీడియా బలంగా భావిస్తోంది. ఆ విషయాన్నే బలవంతంగా అయినా ప్రజలపై రుద్దుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి.. ఈ చట్టం ఓ అద్భుతం.. ప్రజలకు ప్రయోజనకరం అని అని ఈటీవీ అన్నదాతలో స్టోరీ పబ్లిష్ అయింది. ఈ వీడియో ఈటీవీ విన్ యూట్యూబ్ ఛానల్ లో ఉంది. ప్రస్తుతం ఈ చట్టం గురించి నెగిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్న క్రమంలో ఈ వetv{#}Janasena;you tube;TDP;Hanu Raghavapudi;October;media;YCP;Andhra Pradeshరామోజీ ఈటీవీ వీడియోను వైరల్‌ చేస్తున్న వైసీపీ.. అడ్డంగా దొరికారుగా?రామోజీ ఈటీవీ వీడియోను వైరల్‌ చేస్తున్న వైసీపీ.. అడ్డంగా దొరికారుగా?etv{#}Janasena;you tube;TDP;Hanu Raghavapudi;October;media;YCP;Andhra PradeshMon, 06 May 2024 09:00:00 GMTకొన్ని రోజులుగా టీడీపీ దాని అనుకూల మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేస్తున్న దుష్ర్పచారం అంతా ఇంతా కాదు. అయితే తమకు నచ్చిందే ప్రజలు నమ్మాలని ఎల్లో మీడియా బలంగా భావిస్తోంది. ఆ విషయాన్నే బలవంతంగా అయినా ప్రజలపై రుద్దుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి.. ఈ చట్టం ఓ అద్భుతం.. ప్రజలకు ప్రయోజనకరం అని అని ఈటీవీ అన్నదాతలో స్టోరీ పబ్లిష్ అయింది.


ఈ వీడియో ఈటీవీ విన్ యూట్యూబ్ ఛానల్ లో ఉంది. ప్రస్తుతం ఈ చట్టం గురించి నెగిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్న క్రమంలో ఈ వీడియోను యూ ట్యూబ్ ఛానల్ నుంచి మాయం చేశారు. కానీ ఇది వైసీపీ సోషల్ మీడియా విభాగానికి దొరకడంతో తెగ ఆడేసుకుంటున్నారు. దీనిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ చట్టం ప్రజలకు ఉపయోగకరం అని ఈటీవీనే ఒప్పుకుంది అని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  బిల్లును 2019 జులైలో అసెంబ్లీలో ఆమోదించి.. కేంద్రానికి పంపించారు. పలు మార్పుల తర్వాత అక్టోబరు 31 నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2023 అమల్లోకి వచ్చింది.  ఆనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం.. ఇది అమలు అయితే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు. రైతులకు మేలు జరుగుతుంది అంటూ ఈటీవీ ఛానల్ తన అన్నదాత కార్యక్రమంలో స్పెషల్ ప్రోగాం ప్రసారం చేసింది.


కానీ ఇప్పుడు ఇది ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారే సరికి.. ఈ వీడియోను వెంటనే తమ యూ ట్యూబ్ ఛానల్.. ఈటీవీ విన్ యాప్ నుంచి మాయం చేసేశారు. ప్రస్తుతం ఏదో ఒక అంశాన్ని తీసుకొని ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో టీడీపీ, జనసేన లకు ఈ చట్టం కనిపించింది. వెంటనే దీనిపై బురద చల్లడం ప్రారంభించారు. కానీ గతంలో చేసిన వీడియో వైసీపీకి దొరకడంతో తెగ ట్రోల్ చేస్తూ.. టీడీపీని, ఎల్లో మీడియాను ఇరుకున పెడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>