PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huge-shock-to-pv-ramesh-in-land-titling-act-tweet-details-here-goes-viral0a4ca682-a600-4524-bc3c-eedd4edb3618-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huge-shock-to-pv-ramesh-in-land-titling-act-tweet-details-here-goes-viral0a4ca682-a600-4524-bc3c-eedd4edb3618-415x250-IndiaHerald.jpgల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా అమలులోకి రాకపోయినా ఈ యాక్ట్ చుట్టూ జరుగుతున్న కుట్రలు అన్నీఇన్నీ కావు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ట్వీట్ ను టీడీపీ అనుకూల మీడియా జోరుగా ప్రచారం చేసుకుంది. pv ramesh{#}Perni Nani;Application;Raccha;TDP;Jagan;media;Party;YCP;Newsల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అడ్డంగా బుక్కైన పీవీ రమేష్.. కుట్రలో భాగంగానే ట్వీట్ చేశారా?ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అడ్డంగా బుక్కైన పీవీ రమేష్.. కుట్రలో భాగంగానే ట్వీట్ చేశారా?pv ramesh{#}Perni Nani;Application;Raccha;TDP;Jagan;media;Party;YCP;NewsMon, 06 May 2024 18:52:00 GMTల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా అమలులోకి రాకపోయినా ఈ యాక్ట్ చుట్టూ జరుగుతున్న కుట్రలు అన్నీఇన్నీ కావు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ట్వీట్ ను టీడీపీ అనుకూల మీడియా జోరుగా ప్రచారం చేసుకుంది.
 
అయితే పీవీ రమేష్ తర్వాత తన ట్వీట్ లో తప్పును గ్రహించి ఆ ట్వీట్ లో మార్పులు చేసి అడ్డంగా బుక్కయ్యారు. జగన్ సర్కార్ పరువు తీయాలని టార్గెట్ చేసి మరీ పీవీ రమేష్ ట్వీట్ చేసినట్టు ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి. మరోవైపు ఆయన ట్వీట్ లో స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలాజరిగింది అంటూ ట్వీట్ లో మార్పులు చేశారు. చట్టం అమలులోకి రాకుండానే అన్యాయం ఎలా జరుగుతుందని ఆ చట్టం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పీవీ రమేష్ తో బాటు అయన సోదరులకు కూడా భాగం ఉందని, ఈ క్రమంలో భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అందుకే ఆయన భూమి మ్యుటేషన్ జరగలేదని అధికారులు చెబుతున్నారు.
 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉన్నా ఆ పత్రాలను సమర్పించకుండా మ్యుటేషన్ చేయమంటే ఎలా చేస్తారో పీవీ రమేష్ చెప్పాలని
 అధికారులు కామెంట్లు చేస్తున్నారు. ఒక పార్టీ మీడియా ట్రాప్ లో పడి పీవీ రమేష్ ఇబ్బందుల్లో పడ్డారని నెటిజన్లు, వైసీపీ అభిమానులు చెబుతున్నారు. పీవీ రమేష్ తనవని చెబుతున్న భూముల్లో కొంత ప్రభుత్వ భూములు సైతం ఉన్నాయని భోగట్టా. ఒక రైతుతో పీవీ రమేష్ కు సరిహద్దు వివాదం కూడా ఉందని సమాచారం అందుతోంది. పీవీ రమేష్ విన్నుకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని పేర్ని నాని సూచించారు.






" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>