BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy36c6bdba-b6b8-42bf-88de-92a4f00af964-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy36c6bdba-b6b8-42bf-88de-92a4f00af964-415x250-IndiaHerald.jpgరేవంత్‌రెడ్డి ప్రచారంలో జోరుపెంచారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చేవెళ్ల అభ్యర్థికి మద్దతుగా తుక్కుగూడ, శంషాబాద్‌లలో ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. రాముడి పేరుతో భాజపా దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాముడి ప్రాణప్రతిష్ట జరగకముందే రేషన్‌ బియ్యాన్ని పంపి..అక్షింతలంటూ ప్రజలను భాజపా మోసంచేసిదంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఈస్టిండియా కంపెనీ తరహాలో ప్రధాని మోదీ, అమిత్‌షాలు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని సీఎం రrevanth reddy{#}politics;Telangana Chief Minister;Telangana;Prime Minister;CM;Reddy;Bharatiya Janata Partyరేవంత్‌ షాక్‌: అవి రాముడి అక్షింతలు కాదు.. రేషన్‌ బియ్యం?రేవంత్‌ షాక్‌: అవి రాముడి అక్షింతలు కాదు.. రేషన్‌ బియ్యం?revanth reddy{#}politics;Telangana Chief Minister;Telangana;Prime Minister;CM;Reddy;Bharatiya Janata PartyMon, 06 May 2024 07:55:00 GMTరేవంత్‌రెడ్డి ప్రచారంలో జోరుపెంచారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చేవెళ్ల అభ్యర్థికి మద్దతుగా తుక్కుగూడ, శంషాబాద్‌లలో ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. రాముడి పేరుతో భాజపా దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాముడి ప్రాణప్రతిష్ట జరగకముందే రేషన్‌ బియ్యాన్ని పంపి..అక్షింతలంటూ ప్రజలను భాజపా మోసంచేసిదంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.


ఈస్టిండియా కంపెనీ తరహాలో ప్రధాని మోదీ, అమిత్‌షాలు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్లపై మాట్లాడితే దిల్లీలో కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు దేశానికి ప్రధానిగా చేసిన పెద్దమనిషి రాష్ట్రానికి పది పైసల పనిచేయలేదంటూ ఆక్షేపించారు. దేవుడి పేరిట బీజేపీ నాటకాలాడుతుంటే తెలంగాణ సెంటిమెంట్‌ పేరు చెప్పి భారాస నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తుక్కుగూడలో మేనిఫెస్టో ప్రకటనతో దేశంలో గొప్పమార్పునకు నాంది పలికినట్లు రేవంత్‌ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>