PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan674a8850-ccb3-4fac-b831-7829bfbed67c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan674a8850-ccb3-4fac-b831-7829bfbed67c-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆయా ప్రభుత్వాల జెండా రంగులను ప్రజలమీద పులమాలని చూస్తూ వుంటారు. ఈ క్రమంలోనే రైతులు, గ్రామీణ భూ యజమానుల పట్టాదార్‌ పాసు పుస్తకాలపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫొటోను వేయడం జరిగింది. అవును, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల చేసిన తప్పుల్లో ఒకటిగా దీనిని చెప్పుకోవచ్చు. అయితే దీనికంటూ కొన్ని పరిధిలుంటాయి. గ్రౌండ్ లెవెల్‌లో ఈ విషయం ఎంత తీవ్రంగా ఉందంటే.. పట్టాదార్ పాస్‌బుక్‌లో జగన్ ఫోటో తీసేసేలా చూడాలని ఓ రైతు వచ్చి అడగడంతో వైఎస్ భారతి స్వయంగా ఇబ్బంది పడే పరిస్థితి దాపap cm jagan{#}bharathi old;Prakasam;Letter;Telangana Chief Minister;Jagan;Reddy;CBN;Government;CM;TDPఏపీ: పాస్‌బుక్‌ల నుండి సిఎం ఫోటో తొలగించాలని డిమాండ్...?ఏపీ: పాస్‌బుక్‌ల నుండి సిఎం ఫోటో తొలగించాలని డిమాండ్...?ap cm jagan{#}bharathi old;Prakasam;Letter;Telangana Chief Minister;Jagan;Reddy;CBN;Government;CM;TDPMon, 06 May 2024 13:02:00 GMTరాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆయా ప్రభుత్వాల జెండా రంగులను ప్రజలమీద పులమాలని చూస్తూ వుంటారు. ఈ క్రమంలోనే రైతులు, గ్రామీణ భూ యజమానుల పట్టాదార్‌ పాసు పుస్తకాలపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫొటోను వేయడం జరిగింది. అవును, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల చేసిన తప్పుల్లో ఒకటిగా దీనిని చెప్పుకోవచ్చు. అయితే దీనికంటూ కొన్ని పరిధిలుంటాయి. గ్రౌండ్ లెవెల్‌లో ఈ విషయం ఎంత తీవ్రంగా ఉందంటే.. పట్టాదార్ పాస్‌బుక్‌లో జగన్ ఫోటో తీసేసేలా చూడాలని ఓ రైతు వచ్చి అడగడంతో వైఎస్ భారతి స్వయంగా ఇబ్బంది పడే పరిస్థితి దాపురించింది. ఈ సంఘటన పులివెందులలో భారతి ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఒక రైతు ఆమె వద్దకు వచ్చి అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. రైతులు అనేకమంది ఇపుడు వైస్సార్ పార్టీని ఉద్దేశించి... "దయచేసి మా పాస్‌బుక్‌ల నుండి సిఎం ఫోటో తొలగించండి. అదేవిధంగా పాసు పుస్తకాలపై సీఎం ఫొటో వద్దు, కేవలం మా ఫోటోలు (రైతుల ఫోటోలు) మాత్రమే ఉంచండి." అని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు కూడా రాయడం జరిగినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను అప్పనంగా కొట్టేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాజాగా ఆరోపించిన సంగతి అందరికీ విదితమే.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ... పట్టాదారు పుస్తకాలపై జగన్‌ ఫోటో ఉండడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటి ప్రతిని చంద్రబాబు చింపివేసిన సంగతి అందరికీ తెలిసిందే. నవరత్నాల పేరిట అనేక మోసాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్‌పై మండిపడ్డారు. ప్రజల భూములను జగన్‌ దగ్గర పెట్టుకోవడం అంటే జగన్‌ చేతికి ఉరితాడును అప్పగించినట్లేనని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావించి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు చేస్తే జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 10 శాతం మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. అదేవిధంగా వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని జగన్‌ వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>