PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp9c5fbe9b-346a-488e-891f-da0359763fee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp9c5fbe9b-346a-488e-891f-da0359763fee-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీలో ఎన్నికల కంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి యాక్ట్ అని వైసీపీ ప్రచారం చేస్తుండగా ఈ యాక్ట్ వల్ల భూములు పోతాయని టీడీపీ చెబుతోంది. టీడీపీ మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేయడం ద్వారా కూటమికి తీవ్రస్థాయిలో లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. ల్యాండ్ టైట్లింగ్ విషయంలో గతంలో ఆహా ఓహో అంటూ పొగిడిన టీడీపీ నేతలు నేడు విమర్శలు చేస్తున్నారు. tdp{#}PAYYAVULA KESHAV;media;YCP;TDP;Elections;Party;Bharatiya Janata Partyనాడు తప్పు నేడు ఒప్పైందా.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ అడ్డంగా బుక్కైందా?నాడు తప్పు నేడు ఒప్పైందా.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ అడ్డంగా బుక్కైందా?tdp{#}PAYYAVULA KESHAV;media;YCP;TDP;Elections;Party;Bharatiya Janata PartyMon, 06 May 2024 14:05:00 GMTప్రస్తుతం ఏపీలో ఎన్నికల కంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి యాక్ట్ అని వైసీపీ ప్రచారం చేస్తుండగా ఈ యాక్ట్ వల్ల భూములు పోతాయని టీడీపీ చెబుతోంది. టీడీపీ మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేయడం ద్వారా కూటమికి తీవ్రస్థాయిలో లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. ల్యాండ్ టైట్లింగ్ విషయంలో గతంలో ఆహా ఓహో అంటూ పొగిడిన టీడీపీ నేతలు నేడు విమర్శలు చేస్తున్నారు.
 
పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గొప్పదనం చెబుతూ చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో భూ యజమానులకు ఈ చట్టం ఉత్తమమైన చట్టం అని ప్రచారం చేసిన పచ్చ పత్రికలు ఇప్పుడు ఆ చట్టంపై విషం కక్కడానికి ఉన్న ఏ మార్గాన్ని వదులుకోవడం లేదు. తమ పార్టీ అధికారంలో ఉంటే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఉత్తమ చట్టమని లేకపోతే చెత్త చట్టమని ప్రచారం చేయడం టీడీపీ నేతలకే చెప్పింది.
 
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో అపోహలు సృష్టించడంలో టీడీపీ అనుకూల పత్రికలు ముందువరసలో ఉన్నాయి. చంద్రబాబుకు మేలు చేయడానికి ఆయన అనుకూల మీడియా ఎంతకైనా దిగజారుతుందని మళ్లీమళ్లీ ప్రూవ్ అవుతోందని విశ్లేషకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ప్రశంసించారు.
 
ఇప్పుడు మాత్రం ఆ చట్టం గొప్పదనం తెలిసినా ఆమె సైలెంట్ గా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేనంత మూర్ఖులు కాదు. ప్రభుత్వాలు భూములను చట్టంతో లాగేసుకుంటాయంటే నమ్మేంత మూర్ఖులు ఎవరూ లేరు. ఎన్నికలు పూర్తైతే ఈ చట్టం గురించి ఆటోమేటిక్ గా కూటమి నేతలు సైలెంట్ అయిపోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఐడీ ఎంట్రీతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలో టీడీపీ అడ్డంగా బుక్కైందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>