EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagana3834354-dc63-4b79-937f-0008cd3394f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagana3834354-dc63-4b79-937f-0008cd3394f8-415x250-IndiaHerald.jpgఐఏఎస్ బాబులు ఎప్పుడేమి చేస్తారో.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఎవరికీ తెలియదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక్కో సారి ఒక్కో పార్టీకి మద్దతు ఇస్తూ మాట్లాడుతూ జనాలను కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉంటారు. ఐదారు నెలల క్రితం ఏపీలో అమలు చేస్తున్న విధానాలు ప్రజలకు ఏమలు చేస్తాయని.. ఆరోగ్య సురక్ష పథకం అద్భుతమని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్ నారాయణ్ కొనియాడారు. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ.. జగన్ విధానాలు వినాశనానికి దారులు అని.. ఏపీ బాగు పడాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాల్సిందేనని తేల్చి చెప్పారుjagan{#}English medium;kancha ilaiah;CM;Reddy;Jagan;Andhra Pradeshజగన్ పాలనపై జేపీకి కంచె ఐలయ్య అదిరిపోయే సవాల్‌?జగన్ పాలనపై జేపీకి కంచె ఐలయ్య అదిరిపోయే సవాల్‌?jagan{#}English medium;kancha ilaiah;CM;Reddy;Jagan;Andhra PradeshMon, 06 May 2024 06:37:18 GMTఐఏఎస్ బాబులు ఎప్పుడేమి చేస్తారో.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఎవరికీ తెలియదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక్కో సారి ఒక్కో పార్టీకి మద్దతు ఇస్తూ మాట్లాడుతూ జనాలను కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉంటారు. ఐదారు నెలల క్రితం ఏపీలో అమలు చేస్తున్న విధానాలు ప్రజలకు ఏమలు చేస్తాయని.. ఆరోగ్య సురక్ష పథకం అద్భుతమని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్ నారాయణ్ కొనియాడారు.


ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ.. జగన్ విధానాలు వినాశనానికి దారులు అని.. ఏపీ బాగు పడాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న ఆయన సడెన్ గా టీడీపీకి అనుకూలంగా ప్లేట్ ఫిరాయించడం సంచలనంగా మారింది. అయితే జేపీపై సామాజిక విద్యావేత్త, ఫ్రోపెసర్ ఐలయ్య పలు ఆరోపణలు చేశారు. ఆయనకు ప్రజల ప్రయోజనాల కంటే కొన్ని వర్గాల అభ్యున్నతే ముఖ్యం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.


ఏపీ లో ఇంగ్లీష్ మీడియం వ్యవస్థపై ఫ్రొపెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చిందని కొనియాడారు. నాడు నేడు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వంటి విధానాలు దశాబ్దాల కాలంగా కావాలని పోరాటాలు చేసినట్లు వివరించారు. చివరకు ఇది జగన్ మోహన్ రెడ్డితో సాధ్యమైందని చెప్పుకొచ్చారు.


ఒక సామాజిక వేత్తగా విద్యావ్యవస్థలో జగన్ తీసుకువచ్చిన మార్పులను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం అనేది అందుబాటులో లేకుండా పోయిందని.. కానీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి గొప్ప నిర్ణయంపై విమర్శలు చేయడం మంచిది కాదని కొన్ని వర్గాల వారిని ఉద్దేశించి అన్నారు. ఈ మార్పులను అంగీకరించకపోగా.. జేపీ లాంటి విద్యావంతులు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇది పెత్తందారీ విధానానికి నిదర్శనం అన్నారు. ఈ విషయంపై డిబేట్ కి జేపీ వస్తారా అంటూ సవాల్ విసిరారు. మరి దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>