PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pitapuramf1c0b653-bbfd-40a1-b598-d148091a7664-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pitapuramf1c0b653-bbfd-40a1-b598-d148091a7664-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో అనేక మంది మెగా హీరోలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపర్తిలో వద్ద హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారంలో నిన్న ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేపట్టిన ఆయన మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌ రోడ్‌షోపై కొందరు రాళ్లు రువ్వారు. సాయిధరమ్‌ తేజ్‌ లక్ష్యంగా రాయి విసరారు. ఈ రాళ్ల దాడిలో తాటిపర్తికి చెందిన జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్‌ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థిpitapuram{#}mandalam;Allari;Ram Gopal Varma;kakinada;Hero;pithapuram;police;YCP;MLA;Party;Janasenaపిఠాపురం: సాయిధరమ్‌ ప్రచారంపై రాళ్లు.. గాయాలు?పిఠాపురం: సాయిధరమ్‌ ప్రచారంపై రాళ్లు.. గాయాలు?pitapuram{#}mandalam;Allari;Ram Gopal Varma;kakinada;Hero;pithapuram;police;YCP;MLA;Party;JanasenaMon, 06 May 2024 07:50:00 GMTపవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో అనేక మంది మెగా హీరోలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపర్తిలో వద్ద హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారంలో నిన్న ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేపట్టిన ఆయన మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌ రోడ్‌షోపై కొందరు రాళ్లు రువ్వారు. సాయిధరమ్‌ తేజ్‌ లక్ష్యంగా రాయి విసరారు. ఈ రాళ్ల దాడిలో తాటిపర్తికి చెందిన జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్‌ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి..


సాయిధరమ్‌తేజ్‌ ప్రచారం సందర్భంగా జనసేన కార్యకర్తలు గజ్జాలమ్మ కూడలికి చేరుకుని నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న వైసీపీ శిబిరం నుంచి కూడా ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సాయి ధరమ్‌ తేజ్‌ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లారు. అయితే ఆయన తిరిగి వచ్చేలోపు వైసీపీ వాళ్లు టపాసులు కాల్చారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది.


ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి.ఈలోగా  సాయిధరమ్‌తేజ్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. అది నల్లల శ్రీధర్‌ అనే జనసైనికుడికి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుణ్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు మీరంటే మీరే కారణమని ఇరు వర్గాలు ఆరోపించుకుంటున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుణ్ని పరామర్శించారు.


నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని వర్మ హెచ్చరించారు. సాయిధరమ్‌తేజ్‌ చేస్తున్న ప్రచారంలో అల్లరి మూకలు రాయి విసరడంపై కూటమి నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. నిందితులను పట్టుకోకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>