Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywoodd213fdaf-7745-4f99-bc08-c3bfe4a091b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywoodd213fdaf-7745-4f99-bc08-c3bfe4a091b5-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం చూస్తూ ఉంటాం. అదే ఒకప్పుడు హీరోలు మరోసారి హీరోల సినిమాలో నటించాలంటే.. ఏకంగా ప్రధాన పాత్ర దొరికితేనే చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం స్టార్ హీరోల సైతం ఇతర హీరోల సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు కూడా ఒప్పుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా సినిమాలు మల్టీస్టారర్ మూవీస్ కాకపోయినప్పటికీ.. ఇలా ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటించడం చూస్తూ ఉన్నాం. ఇక ఒకప్పటి లాగానే నేటి రోజుల్లో కూడా ఇండKollywood{#}Akkineni Nagarjuna;sekhar;Kollywood;Tollywood;Director;bollywood;Hero;Cinema'కుబేర'లో నాగార్జున పాత్రను.. ఆ హీరో మిస్ చేసుకున్నాడట తెలుసా?'కుబేర'లో నాగార్జున పాత్రను.. ఆ హీరో మిస్ చేసుకున్నాడట తెలుసా?Kollywood{#}Akkineni Nagarjuna;sekhar;Kollywood;Tollywood;Director;bollywood;Hero;CinemaSun, 05 May 2024 09:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం చూస్తూ ఉంటాం. అదే ఒకప్పుడు హీరోలు మరోసారి హీరోల సినిమాలో నటించాలంటే.. ఏకంగా ప్రధాన పాత్ర దొరికితేనే చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం స్టార్ హీరోల సైతం ఇతర హీరోల సినిమాలో  కీలక పాత్రలో నటించేందుకు కూడా ఒప్పుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా సినిమాలు మల్టీస్టారర్ మూవీస్ కాకపోయినప్పటికీ.. ఇలా ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటించడం చూస్తూ ఉన్నాం.


 ఇక ఒకప్పటి లాగానే నేటి రోజుల్లో కూడా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన పాత్రను మరో హీరో దక్కించుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పాలి. ప్రజెంట్ ఇక ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకే కొట్టిన సినిమా కుబేర. ఇక ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. అయితే నాగార్జున సినిమాకు సంబంధించి ఇటీవల మేకర్స్ ఒక చిన్న వీడియోని కూడా రిలీజ్ చేశారు.



 ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. నాగార్జున లుక్స్ అభిమానులందరికీ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ముందుగా ఈ పాత్ర కోసం మరొకరిని అనుకున్నారట. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్. ఆయనతోనే ఈ పాత్ర చేపిస్తే బాగుంటుంది అనుకున్నాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. కానీ కొన్ని కారణాలవల్ల అమితాబచ్చన్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట. ఇక తర్వాత పలువురు కోలీవుడ్ హీరోలను సైతం ఈ పాత్ర కోసం అనుకున్నప్పటికీ చివరికి నాగార్జునను ఫైనల్ చేశారట. మరి ఈ పాత్ర నాగార్జున కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>