EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu4f31e0d7-3657-4169-ab5e-6f85c0730c9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu4f31e0d7-3657-4169-ab5e-6f85c0730c9f-415x250-IndiaHerald.jpgచంద్రబాబు.. రాజకీయంగా ఆయన్ను చాణక్యుడితో పోల్చుతారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. అయితే.. ఇటీవలి కాలంలో ఆయన వ్యూహాలు పెద్దగా వర్కవుట్‌ కావట్లేదు. కానీ.. చివరి వరకూ పోరాడటంలో మాత్రం ఆయన దిట్ట. గెలుపు, ఓటమి ఎలా ఉన్నా.. ప్రత్యర్థిపై అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించడంతో ఆయనకు ఆయనే సాటి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న ఆయన ఈసారి ఎలాగైనా జగన్‌కు దెబ్బ కొట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను చంద్రబాబు ప్రయోగిస్తున్నారు. నేరుగా ప్రత్యర్థిపై పోరాటంchandrababu{#}court;war;Murder.;Chatrapathi Shivaji;Sivaji;television;Assembly;CBNబాబు గారి మైండ్ - రాజకీయ ఖని : ఒక షర్మిల, రవి ప్రకాష్, శివాజీ, ఇంకెవ్వరో?బాబు గారి మైండ్ - రాజకీయ ఖని : ఒక షర్మిల, రవి ప్రకాష్, శివాజీ, ఇంకెవ్వరో?chandrababu{#}court;war;Murder.;Chatrapathi Shivaji;Sivaji;television;Assembly;CBNSun, 05 May 2024 07:57:28 GMTచంద్రబాబు.. రాజకీయంగా ఆయన్ను చాణక్యుడితో పోల్చుతారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. అయితే.. ఇటీవలి కాలంలో ఆయన వ్యూహాలు పెద్దగా వర్కవుట్‌ కావట్లేదు. కానీ.. చివరి వరకూ పోరాడటంలో మాత్రం ఆయన దిట్ట. గెలుపు, ఓటమి ఎలా ఉన్నా.. ప్రత్యర్థిపై అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించడంతో ఆయనకు ఆయనే సాటి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న ఆయన ఈసారి ఎలాగైనా జగన్‌కు దెబ్బ కొట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను చంద్రబాబు ప్రయోగిస్తున్నారు.


నేరుగా ప్రత్యర్థిపై పోరాటం చేయడం రొటీన్‌. చంద్రబాబు వ్యూహాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఆయన ప్రత్యర్థులపై ఎక్కువగా పరోక్ష యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో కొత్త కొత్త పాత్రలను తెరపైకి తెస్తారు. ఈ ఎన్నికల్లో ఆయన ఏకంగా జగన్‌పైకి సొంత చెల్లెళ్లనే ప్రయోగించినట్టు చెబుతున్నారు. వివేకా హత్య కేసుపై పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతను, అన్న తనకు ఆస్తి సరిగ్గా పంచలేదన్న కోపంతో ఉన్న షర్మిలను చంద్రబాబు తెలివిగా జగన్‌పైకి ప్రయోగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


అయితే.. అక్కడితో చంద్రబాబు వ్యూహాలు ఆగలేదు. ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా.. అంతటా కూటమి గెలుస్తోందనే భావనే కనిపించాలి. అందుకు ఆయన తాజాగా రవిప్రకాష్‌ అస్త్రాన్ని ప్రయోగించినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కోర్టు కేసులు, ఇతర అంశాల కారణంగా తెరపై కనిపించని తొలి తరం టీవీ జర్నలిస్టు రవిప్రకాష్‌ కొన్నేళ్ల క్రితం Rtv అనే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. ఛానల్ ప్రారంభించినా ఎప్పుడూ తెరపై కనిపించలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలకు పది రోజుల ముందు తెరపైకి వచ్చిన రవిప్రకాష్‌ ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవబోతున్నాడని తేల్చి చెప్పారు.


ఇప్పుడు రవిప్రకాష్‌ తెరపైకి రావడం చంద్రబాబు వ్యూహంలో భాగమే అన్న చర్చ నడుస్తోంది. అంతే కాదు గత ఎన్నికల ముందు గరుడ పురాణం అంటూ ఏవేవో కథలు వినిపించిన నటుడు శివాజీ కూడా మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. ఒక షర్మిల, ఒక రవిప్రకాష్‌, ఒక శివాజీ.. ఇంకా చంద్రబాబు ప్రవేశపెట్టే కొత్త పాత్రలు ఏమై ఉంటాయా అన్న టాక్‌ పొలిటికకల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>