PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-anantapur-tdp23fd2ce6-5a12-4e48-9b6f-0047f8ec003b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-anantapur-tdp23fd2ce6-5a12-4e48-9b6f-0047f8ec003b-415x250-IndiaHerald.jpgఅనంతపురం నియోజవర్గంలో మరొకసారి టిడిపి పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. అనంతపురం అర్బన్ ప్రాంతం టిడిపి ఎమ్మెల్యే.. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తూ ఉండంగా.. ఈ సభను విజయవంతం చేయడం కోసం పలు రకాల సమావేశాలను నిర్వహించారు.. ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి కార్యాలయంలో ఈ సమావేశాలు జరుగుతూ ఉండగా. ఆ సమయంలోనే ఒకరి డివిజన్లో మరొకరు ఎందుకు వస్తున్నారనే విధంగా చర్చ మొదలయ్యిందట. అలా మొదలైన చర్చ మాటా మాట పెరిగి.. చివరికి మాజీ డిప్RAYALASIMA;ANANTAPUR;TDP{#}choudary actor;vishwa;Ananthapuram;Gharshana;prasad;sudhakar;prabhakar;Parakala Prabhakar;Chintamaneni Prabhakar;police;CBN;Bharatiya Janata Party;MLA;TDP;Partyరాయలసీమ(టీడీపీ) :అనంతలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!రాయలసీమ(టీడీపీ) :అనంతలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!RAYALASIMA;ANANTAPUR;TDP{#}choudary actor;vishwa;Ananthapuram;Gharshana;prasad;sudhakar;prabhakar;Parakala Prabhakar;Chintamaneni Prabhakar;police;CBN;Bharatiya Janata Party;MLA;TDP;PartySun, 05 May 2024 12:15:00 GMTఅనంతపురం నియోజవర్గంలో మరొకసారి టిడిపి పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. అనంతపురం అర్బన్ ప్రాంతం టిడిపి ఎమ్మెల్యే.. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తూ ఉండంగా.. ఈ సభను విజయవంతం చేయడం కోసం పలు రకాల సమావేశాలను నిర్వహించారు.. ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి కార్యాలయంలో ఈ సమావేశాలు జరుగుతూ ఉండగా. ఆ సమయంలోనే ఒకరి డివిజన్లో మరొకరు ఎందుకు వస్తున్నారనే విధంగా చర్చ మొదలయ్యిందట. అలా మొదలైన చర్చ మాటా మాట పెరిగి.. చివరికి మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న అనుచరులు సైతం టిడిపి తెలుగు యువత నాయకుడు లింగారెడ్డి పైన చేయి చేసుకోవడం జరిగింది.

దీంతో దాదాపుగా రెండు గంటల పాటు ఇరువురి వర్గాల మధ్య చాలా ఘర్షణ చోటు చేసుకుందట. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి.. ఇద్దరు కూడా ప్రసాద్ కార్యాలయానికి వెళ్లారు.ఈ సమయంలోనే చౌదరి వర్గీయులను ప్రసాద్ కార్యాలయంలోకి రాకుండా టిడిపి నాయకుడు సుధాకర్ నాయుడు, చంద్రదండుప్రకాష్ అడ్డుకోవడం జరిగింది. దీంతో అటు చౌదరి వర్గీయులు ఒకసారిగా తొసుకుంటూ లోపలికి బలంగా వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన సరైన ఫలితం లగ్గించలేదు.


ఒకరిపై ఒకరు అసభ్య పదజాలతో దూషించడంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని రెండు వర్గీయులను అక్కడి నుంచి పంపించేశారు.. ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడిపిలో ఇలా విభేదాలు ఒక్కసారిగా బగ్గుమనడంతో ఆ పార్టీ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు పర్యటనను విజయం చేయడానికి కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇలా చేస్తే ఎలా అంటూ పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు. అయితే గొడవ ముగిసీన కొద్దిసేపటికి ఎమ్మెల్యే చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని టిడిపి గెలుపు కోసమే ఈ బహిరంగ సభను నిర్వహించబోతున్నామంటూ తెలిపారు. ఈ సభని టిడిపి జనసేన బిజెపి నాయకులు విజయవంతం చేయాలంటూ కోరారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>