PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudragada-daughter851a6881-8cb2-43f4-b66e-594651212305-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mudragada-daughter851a6881-8cb2-43f4-b66e-594651212305-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండగా ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు నుండి జనసేన - టీడీపీ - బీజేపీ కూటమిగా ఏర్పడి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా యత్నిస్తుంటే, మరోవైపు అధికార పార్టీ అధినేత జగన్ ఈసారి కూడా గద్దెనెక్కాలని వ్యూహాలు పన్నుతున్నాడు. ఇక MLA అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. అందుకే ఈసారి పిఠాపురం ప్రాంతం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. Mudragada daughter{#}Mudragada Padmanabham;pithapuram;Pawan Kalyan;Jagan;Father;Party;Janasena;Bharatiya Janata Party;TDP;MLAఏపీ: ముద్రగడకు కంటిమీద కునుకు లేకుంకా చేస్తున్న కూతురు... మరో వీడియో రిలీజ్‌?ఏపీ: ముద్రగడకు కంటిమీద కునుకు లేకుంకా చేస్తున్న కూతురు... మరో వీడియో రిలీజ్‌?Mudragada daughter{#}Mudragada Padmanabham;pithapuram;Pawan Kalyan;Jagan;Father;Party;Janasena;Bharatiya Janata Party;TDP;MLASun, 05 May 2024 11:37:27 GMTఏపీలో ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండగా ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు నుండి జనసేన - టీడీపీ - బీజేపీ కూటమిగా ఏర్పడి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా యత్నిస్తుంటే, మరోవైపు అధికార పార్టీ అధినేత జగన్ ఈసారి కూడా గద్దెనెక్కాలని వ్యూహాలు పన్నుతున్నాడు. ఇక mla అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. అందుకే ఈసారి పిఠాపురం ప్రాంతం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. ఫుల్ టైం పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలో వరుసగా సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ మీద రాళ్లు విసిరే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించి తీరుతానని, పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ కూడా కామెంట్లు చేయడం తెలిసిందే. ఈ తరుణంలో హఠాత్తుగా ఉన్నట్టుండి ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ముద్రగడ కూతురు క్రాంతి. అవును, తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్‌ను తప్పుబట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేసి ఆంధ్ర రాజకీయాలను హీట్ ఎక్కించారు.

ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ... "జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన పిఠాపురం వాసుల అదృష్టం. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం అయితే చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకు చాలా ఉంది. పవన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కల్యాణ్‌ స్పందించారు.. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోండి! మీ ఊహకే వదిలేస్తున్నాను!" అని సూచించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>