Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee2db5559-a596-49af-8836-b63b886365ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee2db5559-a596-49af-8836-b63b886365ad-415x250-IndiaHerald.jpgసౌత్ లో లేడీ కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుది కోవై సరళ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమలలో 300లకు పైగా చిత్రాల్లో నటించింది.9వ తరగతిలో ఉన్నప్పుడే తొలి సినిమా అవకాశం వచ్చింది. 1979లో ‘వెల్లి రథం‘ అనే తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో సత్తా చాటింది. తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది.తాజాగా ఈ సీనియర్ నటి ‘ఆలీతో సరదాగా‘ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కుటుంబంతో పాటు సినిమాలsocialstars lifestyle{#}kovai sarala;Kannada;Ishtam;Father;marriage;Comedian;Allu Arjun;Director;Tollywood;Cinema;Coimbatore;Love;Tamilఅల్లు అర్జున్​ను పెళ్లి చేసుకోవాలనుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోవై సరళ..!!అల్లు అర్జున్​ను పెళ్లి చేసుకోవాలనుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోవై సరళ..!!socialstars lifestyle{#}kovai sarala;Kannada;Ishtam;Father;marriage;Comedian;Allu Arjun;Director;Tollywood;Cinema;Coimbatore;Love;TamilSun, 05 May 2024 19:45:00 GMTసౌత్ లో లేడీ కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుది కోవై సరళ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమలలో 300లకు పైగా చిత్రాల్లో నటించింది.9వ తరగతిలో ఉన్నప్పుడే తొలి సినిమా అవకాశం వచ్చింది. 1979లో ‘వెల్లి రథం‘ అనే తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో సత్తా చాటింది. తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది.తాజాగా ఈ సీనియర్ నటి ‘ఆలీతో సరదాగా‘ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కుటుంబంతో పాటు సినిమాలకు సంబంధించిన ఎవరికీ తెలియని ముచ్చట్లు చెప్పింది. కోయంబత్తూర్ ను కోవై అంటారని, అక్కడే పుట్టి పెరిగిన తనను కోవై సరళ అంటారని వెల్లడించింది. తనతో పాటు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నట్లు చెప్పిన ఆమె, అందరూ జీవితంలో సెటిల్ అయ్యారని వివరించింది. ఇప్పుడు అందరూ కోయంబత్తూర్ లోనే ఉన్నారని చెప్పింది. తనతో సినిమా చేసేందుకు దిగ్గజ నటుడు కమల్ హాసన్ ఏకంగా మూడు నెలలు వెయిట్ చేసినట్లు వివరించింది.తెలుగు సినిమా పరిశ్రమలో ఏ కమెడియన్ అంటే ఇష్టం అనే ప్రశ్నకు సిగ్గు పడుతూ సమాధానం చెప్పింది. ఏయ్, కావాలనే ఈ ప్రశ్న అడుగుతున్నావ్ కదా.? నేను ఎప్పుడో మీకు ఐ లవ్ చెప్పాను అని ఆలీతో అనడంతో అందరూ నవ్వారు. తన వాయిస్ పుట్టుకతోనే అలా వచ్చిందని చెప్పింది. తెలుగులో తనకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పింది కోవై సరళ. ఆయన తెరకెక్కించిన ‘దేశ ముదురు‘ సినిమా తనకు ఎంతో గుర్తింపు తెచ్చిందని వివరించింది.పెళ్లి చేసుకుని ఉద్దరించాలని ఎవరూ ఏమీ చెప్పలేదన్నారు. పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉంటడమే మంచిదని చెప్పింది. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో పెళ్లి చేసుకోవంటే, అల్లు అర్జున్ ను చేసుకుంటానని మనసులో మాట బయటపెట్టింది. చిన్నప్పుడు తన పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారని చెప్పింది. తండ్రి డప్పు కొట్టి డబ్బులు సంపాదించేవారని చెప్పింది. డబ్బు విలువ ఏంటో తమకు బాగా తెలుసని చెప్పింది. చాలా మంది మా కుటుంబానికి డబ్బు పిచ్చి ఉందని భావిస్తారు. కానీ, డబ్బులేక పడిన ఇబ్బంది ఏంటో తనకు బాగా తెలుసని కోవై సరళ వెల్లడించింది. అందుకే, వచ్చిన అవకాశాలు అన్నింటినీ వినియోగించుకుంటున్నట్లు వివరించింది. కళామతల్లికు తన జీవితాన్ని అంకితం చేసినట్లు వివరించింది. ప్రస్తుతం సౌత్ లోని పలు సినిమాల్లో నటిస్తున్నట్లు కోవై సరళ వివరించింది. వీటిలో పలు తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు ఉన్నట్లు తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>