PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/postal-ballot-votesb4a6d4b2-b965-40cc-8359-2891d1c21575-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/postal-ballot-votesb4a6d4b2-b965-40cc-8359-2891d1c21575-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం మొదలైన సంగతి తెలిసిందే. ఉద్యోగులు తమ పార్టీకే అనుకూలమని ఇటు కూటమి నేతలు, వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటుండగా ఉద్యోగులలో ఎక్కువమంది వైసీపీకే అనుకూలంగా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ సీపీఎస్ అమలు చేయకపోయినా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. postal ballot votes{#}Indian Postal Service;Saturday;CBN;Jagan;Party;YCPఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ పార్టీకే అనుకూలమా.. పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది ఇదే!ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ పార్టీకే అనుకూలమా.. పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది ఇదే!postal ballot votes{#}Indian Postal Service;Saturday;CBN;Jagan;Party;YCPSun, 05 May 2024 11:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం మొదలైన సంగతి తెలిసిందే. ఉద్యోగులు తమ పార్టీకే అనుకూలమని ఇటు కూటమి నేతలు, వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటుండగా ఉద్యోగులలో ఎక్కువమంది వైసీపీకే అనుకూలంగా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ సీపీఎస్ అమలు చేయకపోయినా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
 
కూటమి మేనిఫెస్టోలో సీపీఎస్ విషయంలో ఆచితూచి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నా కచ్చితమైన హామీ లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ఒకింత కఠినంగా వ్యవహరిస్తారనే పేరు ఉండగా ఆ పేరు పార్టీకి మైనస్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు గత అనుభవాల దృష్ట్యా కూటమి కంటే వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
 
ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో నగదు జమవుతుందని చంద్రబాబు చెబుతున్నా బాబు చెప్పిన పథకాలను అమలు చేస్తే తమకు జీతాలు సకాలంలో ఎలా క్రెడిట్ అవుతాయనే భయం కూడా ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతోంది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులే గెలుపోటములను డిసైడ్ చేయగలరు.
 
అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉద్యోగులు కదం తొక్కుతుండగా అధికార పార్టీ నేతలు టెన్షన్ లేకుండా ఉంటే ఇతర పార్టీల నేతలకు మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తెలుస్తోంది. 70 శాతం ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే విజయమని ప్రజలు సైతం నమ్ముతారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ ఉద్యోగులే కారణమయ్యారు. ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ విషయంలో అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>