MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-victory-or-loss-whats-the-status77cdf5d5-b591-418b-a04c-6912e6b2f253-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-victory-or-loss-whats-the-status77cdf5d5-b591-418b-a04c-6912e6b2f253-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లలో కూడా పాల్గొంటున్నారు. పవన్ ప్రస్తుతం ఇలా రాజకీయాలు , సినిమాలతో చాలా కష్టపడుతున్నాడు. ఇక పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని పవన్ చాలా రోజుల క్రితమే ప్రారంభించాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ ఉండడంతో క్రిష్ ఈ మూవీ నుండిpawan{#}harish shankar;sujeeth;Genre;september;Darsakudu;Audience;kalyan;Hero;Director;politics;jyothi;Cinema;Interviewపవన్ కి రాత్రి వేళ ఏ జోనర్ సినిమాలు నచ్చుతాయో తెలుసా..?పవన్ కి రాత్రి వేళ ఏ జోనర్ సినిమాలు నచ్చుతాయో తెలుసా..?pawan{#}harish shankar;sujeeth;Genre;september;Darsakudu;Audience;kalyan;Hero;Director;politics;jyothi;Cinema;InterviewSun, 05 May 2024 10:24:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లలో కూడా పాల్గొంటున్నారు. పవన్ ప్రస్తుతం ఇలా రాజకీయాలు , సినిమాలతో చాలా కష్టపడుతున్నాడు. ఇక పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని పవన్ చాలా రోజుల క్రితమే ప్రారంభించాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ ఉండడంతో క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ మూవీ తో పాటు పవన్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ లోను , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలపై పెద్దగా క్లారిటీ లేదు కానీ హరిహర వీరమల్లు మూవీ ని ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

అలాగే ఓజి మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇకపోతే చాలా వరకు పవన్ అభిమానులు , మామూలు ప్రేక్షకులు కూడా ఇంత స్టార్ హీరో అయినా ఇతను ఎలాంటి జోనర్ సినిమాలను ఇష్టపడతాడు అనే విషయం తెలుసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో పవన్ తనకు రాత్రి పూట ఏ జోనర్ సినిమాలు ఇష్టమా అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఓ హార్రర్ మూవీ చూడడానికి ఇష్టపడతాను అని చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>