PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp46eabff3-4b87-4da4-8622-39ab4c5bb9c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp46eabff3-4b87-4da4-8622-39ab4c5bb9c9-415x250-IndiaHerald.jpgమా అన్నయ్య బంగారం, దెయ్యంతో సహజీవనం వంటి సినిమాలను నిర్మించి పాపులర్ అయిన సినీ నిర్మాత నట్టికుమార్ తాజాగా ఏపీ రాజకీయాలపై సన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో పోటీ చేస్తున్న పారిశ్రామికవేత్తల గెలుపు ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగారు. tdp{#}NTR;BOTCHA SATYANARAYANA;Industries;University;you tube;producer;Sugar;Producer;Dubai;Nattikumar;Annayya;Anakapalle;bharath;Sri Bharath;Kumaar;Thota Chandrasekhar;Cinema;India;Balakrishna;Vishakapatnam;CM;Andhra Pradesh;TDP;YCPఏపీ: టీడీపీ ఎంపీలు లక్షల మెజారిటీతో గెలుస్తారంటూ సినీ నిర్మాత షాకింగ్ కామెంట్స్..?ఏపీ: టీడీపీ ఎంపీలు లక్షల మెజారిటీతో గెలుస్తారంటూ సినీ నిర్మాత షాకింగ్ కామెంట్స్..?tdp{#}NTR;BOTCHA SATYANARAYANA;Industries;University;you tube;producer;Sugar;Producer;Dubai;Nattikumar;Annayya;Anakapalle;bharath;Sri Bharath;Kumaar;Thota Chandrasekhar;Cinema;India;Balakrishna;Vishakapatnam;CM;Andhra Pradesh;TDP;YCPSun, 05 May 2024 09:02:00 GMTమా అన్నయ్య బంగారం, దెయ్యంతో సహజీవనం వంటి సినిమాలను నిర్మించి పాపులర్ అయిన సినీ నిర్మాత నట్టికుమార్ తాజాగా ఏపీ రాజకీయాలపై సన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో పోటీ చేస్తున్న పారిశ్రామికవేత్తల గెలుపు ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగారు. విశాఖపట్నం ఎంపీ, గీతం యూనివర్సిటీ ఛైర్మన్ మతుకుమిల్లి భరత్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో టీడీపీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారని, ఎన్టీఆర్ హయాం నుంచి వారు విశాఖపట్నానికి మంచి చేస్తూ వస్తున్నారని, అందువల్ల టీడీపీ అభ్యర్థిని ప్రజలు తప్పకుండా గెలిపిస్తారని నట్టికుమార్ ధీమా వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీ కూడా పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తుందని అన్నారు. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ గెలిస్తే విశాఖపట్నంలో సినిమా స్టూడియో నిర్మించవచ్చని అన్నారు. 32 కిలోమీటర్ల పాటు కారిడార్, ఇంకా సినిమా డబ్బింగ్ సెంటర్లు కూడా కట్టవచ్చని అంచనా వేశారు.

అమెరికన్, దుబాయ్ కాన్సలేట్ కూడా తీసుకురావచ్చని పేర్కొన్నారు. భరత్ కు ప్రత్యర్థిగా నిలుస్తున్న డా. బొత్స జాన్సీ లక్ష్మి గురించి కూడా నట్టికుమార్ మాట్లాడారు. బొత్స ఝాన్సీ రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు కానీ ఆమె పార్లమెంట్లో విశాఖపట్నం గురించి ఒక్కసారి కూడా గొంతు ఎత్తలేదు, అలాంటి అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా ఒకటే అన్నట్లు షాకింగ్ కామెంట్లు చేశారు. బొత్స ఫ్యామిలీ విశాఖపట్నం ని దోచుకొని దాచుకున్నారే తప్ప ఏ రోజు ఆ జిల్లాకి మంచి చేసిన దాఖలాలు లేవని సంచలన ఆరోపణలు చేశారు.

విశాఖపట్నం ఎంపీగా పని చేసిన ఎంవీవీ సత్యనారాయణ కూడా వేలకోట్లు దోచుకున్నారని నటి కుమార్ అలిగేషన్స్ చేశారు. 2,50,000 మెజారిటీతో భారత్ గెలుస్తారని కూడా ఆయన జోష్యం చెప్పారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా మంచి మెజారిటీతో విజయ బావుటా ఎగరవేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేష్ గెలిస్తే అనకాపల్లిలో పరిశ్రమలు రావచ్చని అన్నారు షుగర్ ఫ్యాక్టరీలు ఇటువంటివి అవతరిస్తాయని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లిలో గెలిస్తే ప్రజలకు నష్టం తప్ప లాభం అనేది ఏమీ ఉండదని కూడా అన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రావు గుంటూరులో లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని కూడా ఆయన అన్నారు. నారా లోకేశ్‌ సమక్షంలో మే 6న టీడీపీలో చేరనున్నట్టు కూడా తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>