PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jogi-ramesh-bode-prasad-pedana-tdp-ycp339e63d8-d002-48c4-94d7-b83ffbda3f80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jogi-ramesh-bode-prasad-pedana-tdp-ycp339e63d8-d002-48c4-94d7-b83ffbda3f80-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి చాలా రసవత్తమైనటువంటి యుద్ధం జరుగుతోంది. వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టిడిపి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల పోటీ విషయాల్లో ఆచితూచి అడుగులు వేశారు. ఇక అధికార వైసిపి పార్టీ మాత్రం చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసింది. దీనికి ప్రధాన కారణం వారిపై కాస్త వ్యతిరేకత రావడమే. ఈ విధంగా సరికొత్త స్టాటజీలతో జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తే ఆయన ఎత్తులకు పైఎత్తులు వేసే విధంగా చంద్రబాబు నాయుడు దీటైన నాయకులను బరిలోదించారు. మార్పులో భాగంగాJOGI RAMESH;BODE PRASAD;PEDANA;TDP;YCP{#}prasad;Krishna River;Kamma;devineni avinash;Hanu Raghavapudi;Scheduled caste;war;Thota Chandrasekhar;Penamaluru;Nuziveedu;Pedana;Bode Prasad;Congress;MLA;Andhra Pradesh;Parliment;Minister;TDP;local language;Jagan;Elections;Party;YCP;CBNపెనమలూరు :జోగి Vs బోడె.. ప్రజలు నాన్ లోకల్ ని నమ్ముతారా..?పెనమలూరు :జోగి Vs బోడె.. ప్రజలు నాన్ లోకల్ ని నమ్ముతారా..?JOGI RAMESH;BODE PRASAD;PEDANA;TDP;YCP{#}prasad;Krishna River;Kamma;devineni avinash;Hanu Raghavapudi;Scheduled caste;war;Thota Chandrasekhar;Penamaluru;Nuziveedu;Pedana;Bode Prasad;Congress;MLA;Andhra Pradesh;Parliment;Minister;TDP;local language;Jagan;Elections;Party;YCP;CBNSun, 05 May 2024 07:52:29 GMT
పెడనలో చెల్లని రూపాయి పెనమలూరులో చెల్లుతుందా.?

టిడిపి వ్యూహాలు వర్కౌట్ అవుతాయా.?

 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి చాలా రసవత్తమైనటువంటి యుద్ధం జరుగుతోంది. వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి,  టిడిపి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల పోటీ విషయాల్లో ఆచితూచి అడుగులు వేశారు. ఇక అధికార వైసిపి పార్టీ మాత్రం  చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసింది.  దీనికి ప్రధాన కారణం వారిపై కాస్త వ్యతిరేకత రావడమే. ఈ విధంగా సరికొత్త స్టాటజీలతో జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తే ఆయన ఎత్తులకు పైఎత్తులు వేసే విధంగా చంద్రబాబు నాయుడు దీటైన నాయకులను బరిలోదించారు. మార్పులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం నుంచి పెనమలూరు వచ్చారు. మరి ఆ నియోజకవర్గంలో ఈ స్థానికేతరుడు విజయం సాధిస్తాడా..వైసీపీకి ఏ విధమైన పట్టు ఉంది. స్థానిక  నాయకుడిని ఓడిస్తాడా.. అనే వివరాలు చూద్దాం..

 కృష్ణా జిల్లాలోని ఈ పెలమలూరు  నియోజకవర్గం చాలా కీలక స్థానం. 2009కి ముందు ఇది ఉయ్యూరు నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడ కులాలపరంగా చూస్తే కమ్మ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉంటాయి. ఆ తర్వాత ముస్లిం, ఎస్టీ, మాదిగ ఉంటారు. అంతేకాకుండా ఎస్సీ మాల, కాపు కులస్తులు కూడా అత్యధికంగానే ఉంటారు. రాజకీయంగా కమ్మ సామాజిక వర్గం ఆదిపత్యం ఎక్కువగా ఉంటుంది. వీరిని  యాదవ కులస్తులు ఢీకొడుతూ ఉంటారు. ఎన్నో వ్యాపార సంస్థలు కలిగి ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఎన్నికల్లో చాలా అద్భుతమైనటువంటి తీర్పును ఇస్తూ ఉంటారు. 2009లో నియోజకవర్గాల విభజనలో భాగంగా ఏర్పడిన పెనమలూరులో ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ ,  2014లో బోడే ప్రసాద్ టిడిపి, 2019లో వైసీపీ నుంచి పార్థసారధి గెలిచారు. అలాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి స్థానికుడు మరియు స్థానికేతరుల మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుంది. ఇందులో ఏ అభ్యర్థికి  ఎలాంటి అంశాలు కలిసి రానున్నాయి అనే వివరాలు చూద్దాం.

 గెలుపోటములు:
 పెనమలూరు నియోజకవర్గంలో 2019 వైసీపీ తరఫున గెలిచినటువంటి పార్థసారథి  ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఆయన  టిడిపిలో చేరిపోయారు. దీంతో ఆయనకు నూజివీడు టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఈ విధంగా ఎంతో బలంగా ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గంలో వైసిపికి పెద్ద దెబ్బ తగిలింది. అంతేకాకుండా ఇక్కడికి మంత్రి జోగి రమేష్ రావడం  స్థానికేతరుడు కావడంతో, పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగానే మారాయని చెప్పవచ్చు. ఇక టిడిపి విషయానికి వస్తే  ఇందులో దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్,  అలాగే దేవినేని బాజీ కోడలు,  అలాగే తుమ్మల చంద్రశేఖర్  ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  వంటి పేర్లను కూడా పరిశీలించారని చంద్రబాబు. కానీ చివరికి పెనమాలూరు టిడిపి ఇన్చార్జిగా ఉన్నటువంటి బోడే ప్రసాద్, చంద్రబాబు కుటుంబం నుంచి తప్ప ఎవరికి సీటు కేటాయించిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని గట్టిగా వారించాడు. దీంతో చంద్రబాబు మరోసారి ఆలోచన చేసి బోడే ప్రసాద్ కే సీటు కేటాయించారు. బోడె ప్రసాద్  ఇప్పటికే ఒకసారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. స్థానికుడు కాబట్టి ఈయనకు ఇక్కడ పట్టు ఉంది.

 బోడె ప్రసాద్:
 బలాలు:
 స్థానికుడు కావడం.
 గతంలో పోటీ చేసిన అనుభవం.
 టిడిపికి గట్టిపట్టు ఉండడం.
 వైసిపిపై వ్యతిరేకత.
పార్థసారధి కూడా టిడిపిలో చేరడం.

బలహీనతలు:
టికెట్ ఆశించిన నేతలు సపోర్ట్
చేయకపోవడం.

 జోగి రమేష్:
 బలాలు:
 మంత్రిగా పనిచేసిన అనుభవం.
 వైసీపీలో జరిగిన అభివృద్ధి.
 టిడిపిలో అలిగిన నాయకులతో లాభం.

బలహీనతలు:
 స్థానికేతరుడు.
 పెడనలో అభివృద్ధి చేయకపోవడం.
 మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ వీడడం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>