PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kotla-74aa2578-3e4f-425d-a23e-03a3f72b8413-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kotla-74aa2578-3e4f-425d-a23e-03a3f72b8413-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల వేళ రాజకీయం వేసవి వేడిమిని సైతం భయపెడుతోంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ... "మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా?" అని ప్రశ్నించారు. విషయంలోకి వెళితే... మండలంలోని చనుగొండ్ల, ఓబులాపురం, ఎర్రగుంట్ల, ఇందిరాంపల్లె, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నీతి నిజాయతీతో రాజకీయాలు చేసిన నామీద అనవసర ఆరోపణలు తగవని అన్నారు. తాము అక్రమంగా రూ.కోట్లు సంపాదించలేదన్నారు. వైకాపా ప్రభుత్వం రైతుల జీవితాలతో చkotla {#}surya sivakumar;Thief;Reddy;politics;CM;Janasena;Bharatiya Janata Party;central government;Government;Minister;TDP;Partyఏపీ: వైసీపీ మంత్రికి బహిరంగ సవాల్ విసిరిన కేంద్ర మాజీ మంత్రి..??ఏపీ: వైసీపీ మంత్రికి బహిరంగ సవాల్ విసిరిన కేంద్ర మాజీ మంత్రి..??kotla {#}surya sivakumar;Thief;Reddy;politics;CM;Janasena;Bharatiya Janata Party;central government;Government;Minister;TDP;PartySun, 05 May 2024 12:16:21 GMTఏపీలో ఎన్నికల వేళ రాజకీయం వేసవి వేడిమిని సైతం భయపెడుతోంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ... "మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా?" అని ప్రశ్నించారు. విషయంలోకి వెళితే... మండలంలోని చనుగొండ్ల, ఓబులాపురం, ఎర్రగుంట్ల, ఇందిరాంపల్లె, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నీతి నిజాయతీతో రాజకీయాలు చేసిన నామీద అనవసర ఆరోపణలు తగవని అన్నారు. తాము అక్రమంగా రూ.కోట్లు సంపాదించలేదన్నారు. వైకాపా ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతుందని అన్నారు.

ఈ నేపథ్యంలో ఓబులాపురంలో చనుగొండ్లలో పలువురు తెదేపాలోకి చేరడం జరిగింది. ఈ క్రమంలో వారికి కండువాలు వేసి మరీ కోట్ల వారి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్రకార్యదర్శి శేషిరెడ్డి, వలసలరామకృష్ణ, చిన్ననాగిరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ కేశన్నగౌడ్‌, శ్రీనివాసులు, భరత్‌రెడ్డి, బజారు, వెంకోబరావు, వీరాంజనేయులు, గోరంట్ల తదితరులు పాల్గొన్నారు. ఇక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొన్న నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ దాఖలు చేసిన వ్యవహారం ఎంత వివాదం అయిందో అందరికీ తెలిసిందే.

ఇకపోతే, డోన్‌ మండలంలోని తాడూరు, ఎద్దుపెంట, అనుంపల్లి గ్రామాల్లో కోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా సీఎం పదవిని అడ్డం పెట్టుకుని జగన్‌ రూ.లక్ష కోట్లు అక్రమంగా కాజేస్తే, ఆర్థిక మంత్రి బుగ్గన మాత్రం అక్రమంగా రూ. 20వేల కోట్లు సంపాదించారని విమర్శించిన సంగతి తెలిసినదే. రాష్ట్రానికి రూ. లక్షల కోట్లు అప్పులు చేసి వాటికి లెక్కలు చెప్పకుండా సీఎం, ఆర్థిక మంత్రి ఇద్దరు గజ దొంగలు కలిసి అవినీతికి పాల్పడ్డారని చాలా తీవ్రంగా మండిపడ్డారు. ఆరోజునాటి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, భాస్కర్‌ నాయుడు, రేగటి అర్జున్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఈశ్వరయ్య, తాడూరు వెంకట రమణయ్య, మిద్దెపల్లి గోవిందు, జసర్పంచ్‌ రామిరెడ్డి, యన్న యాదవ్‌, రంగనాథం, జనసేన నాయకుడు బ్రహ్మం, బీజేపీ నాయకుడు వడ్డె మహారాజ్‌ పాల్గొన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>