PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/non-local-to-local-jagan-bumper-gift-to-his-girlfriend5794e158-2058-41d1-a677-e8689aaba086-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/non-local-to-local-jagan-bumper-gift-to-his-girlfriend5794e158-2058-41d1-a677-e8689aaba086-415x250-IndiaHerald.jpg- చాలా మందిని లోక‌ల్ టు నాన్ లోక‌ల్ చేసేసిన జ‌గ‌న్‌ - మాజీ హోం మంత్రి సుచ‌రిత‌కు నాన్ లోక‌ల్ టు లోకల్ గిఫ్ట్‌ - సుచ‌రిత స్వ‌గ్రామం ఫిరంగిపురం తాడికొండ లోదే.. - నాలుగు సార్లు ప్ర‌త్తిపాడులో పోటీ చేసి.. ఫ‌స్ట్ టైం తాడికొండ బ‌రిలో సుచ‌రిత‌ ( గుంటూరు - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే ల సీట్ల‌ను జ‌గ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్టు మార్చేశారు. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయాల‌ని ఆశ ప‌డ్డ వారికి షాక్ ఇస్తూ మ‌రో చోట‌కు మార్చేశారు. ఈ లిస్టులో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు.. సిట్టింగ్ ఎమ్మెల్యAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; mekathoti sucharira{#}Kuchipudi;Paderu;Thadikonda;Suresh;Ishtam;pithapuram;kakinada;Congress;Gift;India;Guntur;YCP;MLA;local language;Ministerనాన్ లోక‌ల్ టు లోక‌ల్‌... త‌న‌ ఇష్టురాలికి జ‌గ‌న్ బంప‌ర్ గిఫ్ట్‌..?నాన్ లోక‌ల్ టు లోక‌ల్‌... త‌న‌ ఇష్టురాలికి జ‌గ‌న్ బంప‌ర్ గిఫ్ట్‌..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; mekathoti sucharira{#}Kuchipudi;Paderu;Thadikonda;Suresh;Ishtam;pithapuram;kakinada;Congress;Gift;India;Guntur;YCP;MLA;local language;MinisterSun, 05 May 2024 11:45:28 GMT- చాలా మందిని లోక‌ల్ టు నాన్ లోక‌ల్ చేసేసిన జ‌గ‌న్‌
- మాజీ హోం మంత్రి సుచ‌రిత‌కు నాన్ లోక‌ల్ టు లోకల్ గిఫ్ట్‌
- సుచ‌రిత స్వ‌గ్రామం ఫిరంగిపురం తాడికొండ లోదే..
- నాలుగు సార్లు ప్ర‌త్తిపాడులో పోటీ చేసి.. ఫ‌స్ట్ టైం తాడికొండ బ‌రిలో సుచ‌రిత‌

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే ల సీట్ల‌ను జ‌గ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్టు మార్చేశారు. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయాల‌ని ఆశ ప‌డ్డ వారికి షాక్ ఇస్తూ మ‌రో చోట‌కు మార్చేశారు. ఈ లిస్టులో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మంత్రులు కూడా ఉన్నారు. కొంద‌రు ఎంపీల‌కు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చారు. కాకినాడ ఎంపీ వంగా గీత‌ను పిఠాపురం పార్ల‌మెంటు బ‌రిలో దింపారు. పాడేరు ఎమ్మెల్యే కొట్ట‌గుళ్ల భాగ్య‌ల‌క్ష్మిని అర‌కు ఎంపీగా బ‌రిలోకి దింపారు.


ఇక మంత్రులు మేరుగ నాగార్జున‌, తానేటి వ‌నిత‌, ఆదిమూల‌పు సురేష్ ఇప్పుడు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా మార్చేశారు. ఇలా చాలా మందిని లోక‌ల్ టు నాన్ లోక‌ల్ చేసేశారు. అయితే ఒక్క మాజీ మంత్రిని.. త‌న‌కు అత్యంత ఇష్టు రాలిని మాత్రం జ‌గ‌న్ నాన్ లోక‌ల్ నుంచి లోక‌ల్‌కు మార్చేశారు. ఇది మాత్రం ఆమెకు బంప‌ర్ గిఫ్ట్ అని చెప్పాలి. ఆ అదృష్ట వంతురాలు ఎవ‌రో ?  కాదు మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌.


వాస్త‌వానికి ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని ఫిరంగిపురం మండ‌లం నుంచే కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున 2006లో జ‌డ్పీటీసీగా గెలిచి జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ సీటు ఆశించారు. ఆ సీటును కూచిపూడి విజ‌య‌కు వ‌చ్చిన వైఎస్ 2009లో ప్ర‌త్తిపాడు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో అక్క‌డ నుంచి కాంగ్రెస్ సీటు ఇవ్వ‌గా ఆమె గెలిచారు. ఆ త‌ర్వాత వైసీపీ నుంచి 2012 ఉప ఎన్నిక‌ల‌తో పాటు 2019లో కూడా గెలిచారు. నాలుగు సార్లు ప్ర‌త్తిపాడులో వ‌రుస‌గా పోటీ చేసిన సుచ‌రిత ఈ సారి మాత్రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ నుంచి ఫ‌స్ట్ టైం త‌న ల‌క్ ప‌రీక్షించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>