MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/getap-seenu5278293d-2943-4e93-ae47-a0a2dc981603-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/getap-seenu5278293d-2943-4e93-ae47-a0a2dc981603-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో గెటప్ శ్రీను ఒకరు. ఈయన జబర్దస్త్ కామెడీ షో లోనే ఒక్కో స్కిట్ కు ఒక్కో రకమైన గెటప్ తో ప్రేక్షకులను వినూత్నంగా ఆకట్టుకోవడంతో ఈయనకు గెటప్ శీను అనే పేరు వచ్చింది. ఇక అందుకు తగినట్టుగానే ఈయన సినిమాల్లో కూడా ఎన్నో రకాలైన పాత్రలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇంతకాలం పాటు టీవీ షో లో ఎక్కువగా పాటిస్పేట్ చేస్తూ తక్కువ సినిమాల్లో నటించిన ఈయన ప్రస్తుతం "రాజు యాదవ్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవgetap seenu{#}getup srinu;Jabardasth;Comedy;television;Event;king;Hero;Cinemaగెటప్ శీను "రాజు యాదవ్" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు..!గెటప్ శీను "రాజు యాదవ్" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు..!getap seenu{#}getup srinu;Jabardasth;Comedy;television;Event;king;Hero;CinemaSat, 04 May 2024 12:10:07 GMTజబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో గెటప్ శ్రీను ఒకరు. ఈయన జబర్దస్త్ కామెడీ షో లోనే ఒక్కో స్కిట్ కు ఒక్కో రకమైన గెటప్ తో ప్రేక్షకులను వినూత్నంగా ఆకట్టుకోవడంతో ఈయనకు గెటప్ శీను అనే పేరు వచ్చింది. ఇక అందుకు తగినట్టుగానే ఈయన సినిమాల్లో కూడా ఎన్నో రకాలైన పాత్రలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. 

ఇంతకాలం పాటు టీవీ షో లో ఎక్కువగా పాటిస్పేట్ చేస్తూ తక్కువ సినిమాల్లో నటించిన ఈయన ప్రస్తుతం "రాజు యాదవ్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను కూడా మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమాను మే 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు.

మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ ట్రైలర్ విడుదల కోసం ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మే 5 వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకు హైదరాబాదు "ఏ ఏ ఏ" సినిమాస్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి మొట్ట మొదటి సారి గెటప్ శీను "రాజు యాదవ్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే ఇతనికి హీరోగా మంచి కెరీర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి రాజు యాదవ్ మూవీ తో గెటప్ శీను ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>