MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adithic46cc670-c394-4c88-bea3-2675c328cf90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adithic46cc670-c394-4c88-bea3-2675c328cf90-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మానులలో అదితి రావు హైదరి ఒకరు. ఈమె సుధీర్ బాబు హీరో గా రూపొందిన సమ్మోహనం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శర్వానంద్ , సిద్ధార్థ్ హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయం లోనే అతిథి రావు adithi{#}Aditi Rao Hydari;ajay;sudheer babu;Heroine;Maha;BEAUTY;Yuva;Telugu;Cinema;Siddharth;Newsఅమ్మ కోరిక మేరకే ఎంగేజ్మెంట్ గురించి చెప్పాను... అదితి రావు..!అమ్మ కోరిక మేరకే ఎంగేజ్మెంట్ గురించి చెప్పాను... అదితి రావు..!adithi{#}Aditi Rao Hydari;ajay;sudheer babu;Heroine;Maha;BEAUTY;Yuva;Telugu;Cinema;Siddharth;NewsSat, 04 May 2024 09:07:20 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మానులలో అదితి రావు హైదరి ఒకరు. ఈమె సుధీర్ బాబు హీరో గా రూపొందిన సమ్మోహనం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈమె అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శర్వానంద్ , సిద్ధార్థ్ హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయం లోనే అతిథి రావు హైదరి , సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. ఇక కొంత కాలం పాటు ప్రేమించి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న వీరిద్దరూ వీరిద్దరూ కొంత కాలం క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

కాకపోతే వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య జరిగింది. దానితో వీరి ఎంగేజ్మెంట్ గురించి మీడియాకు కూడా తెలియలేదు. ఇక ఆ తర్వాత వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు రావడంతో తాజాగా అదితి రావు హైదరి తన ఎంగేజ్మెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా అదితి మాట్లాడుతూ ... 400 ఏళ్ల నాటి రంగనాథ స్వామి ఆలయంలో సిద్ధార్థ్ తో నిశ్చితార్థం జరిగింది.

దీని అనంతరం నిశ్చితార్థం గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది మా అమ్మకు ఫోన్లు చేశారు. ఆమె సమాధానం చెప్పలేక నువ్వే మీడియాకు వెల్లడించు అని నాకు చెప్పింది. దానితో నేను , సిద్ధార్థ్ మా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం అని ఈ బ్యూటీ పేర్కొంది. ఇలా అనేక వార్తల అనంతరం ఈ బ్యూటీ తన ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ప్రకటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>