PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gummanur-jayaram-guntakal-politics-ap-elections-2024b24ab7cf-1a9a-4e41-b10d-f9d1d0f24185-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gummanur-jayaram-guntakal-politics-ap-elections-2024b24ab7cf-1a9a-4e41-b10d-f9d1d0f24185-415x250-IndiaHerald.jpg•సొంత పార్టీకే నమ్మకద్రోహం చేసిన గుమ్మనూరు •టిడిపి నుంచి గుమ్మనూరుకు వ్యతిరేకత •ఈ అంశాలు వెంకటరామి రెడ్డికి కలిసొచ్చేనా.. (గుంతకల్లు - ఇండియా హెరాల్డ్ ) గుంతకల్లు ఇప్పుడు జయరాం అడ్డా కాబోతోందా..? ఎంతోమంది టీడీపీ నేతలు పోటీపడినా ఈ సీటును ఎట్టకేలకు గుమ్మనూరు జయరాం దక్కించుకున్నారు. ఇక జయరాం గెలుపును ఆపే దమ్ము ఎవరికి లేదు అంటున్నారు ఆయన అభిమానులు.. గత రెండు మూడు నెలలుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన గుంతకల్లు సీటు గుమ్మనూరు జయరాం సొంతం కావడంతో తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు..GUMMANUR JAYARAM;GUNTAKAL;POLITICS;AP ELECTIONS 2024{#}jayaram;Guntakal;Alur;March;INTERNATIONAL;Minister;Telugu;India;politics;Thriller;Party;YCP;TDPరాయలసీమ(గుంతకల్లు): అవకాశాన్ని కాలదన్ని..టీడీపీలో చేరిక.. అధికారంలోకి వస్తారా..?రాయలసీమ(గుంతకల్లు): అవకాశాన్ని కాలదన్ని..టీడీపీలో చేరిక.. అధికారంలోకి వస్తారా..?GUMMANUR JAYARAM;GUNTAKAL;POLITICS;AP ELECTIONS 2024{#}jayaram;Guntakal;Alur;March;INTERNATIONAL;Minister;Telugu;India;politics;Thriller;Party;YCP;TDPSat, 04 May 2024 11:54:40 GMT•సొంత పార్టీకే నమ్మకద్రోహం చేసిన గుమ్మనూరు

•టిడిపి నుంచి గుమ్మనూరుకు వ్యతిరేకత

•ఈ అంశాలు వెంకటరామి రెడ్డికి కలిసొచ్చేనా..



(గుంతకల్లు - ఇండియా హెరాల్డ్ )

గుంతకల్లు ఇప్పుడు జయరాం అడ్డా కాబోతోందా..?  ఎంతోమంది టీడీపీ నేతలు పోటీపడినా ఈ సీటును ఎట్టకేలకు గుమ్మనూరు జయరాం దక్కించుకున్నారు. ఇక జయరాం గెలుపును ఆపే దమ్ము ఎవరికి లేదు అంటున్నారు ఆయన అభిమానులు.. గత రెండు మూడు నెలలుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను  తలపించిన గుంతకల్లు సీటు గుమ్మనూరు జయరాం సొంతం కావడంతో తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు.. అక్రమ నేత , ఆలూరు చెత్త గుంతకల్ కి వద్దు అంటూ ఫ్లకార్డ్ లతో నిరసనలు తెలియజేస్తున్నారు. గుమ్మనూరు జయరాం వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ నిరసనలు చేస్తున్నారు..

అంతేకాదు మార్చి 8న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా గుంతకల్లు నియోజకవర్గం లో అక్కడ మహిళా ఓటర్లు సైతం గుమ్మనూరు జయరాం టిడిపి టికెట్ వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేసిన విషయం తెలిసిందే.. ఇకపోతే గుమ్మనూరు జయరాం మొన్నటివరకు వైసీపీలో ఉండి మంత్రి పదవి అనుభవించారు.  వైసీపీ నుంచి ఆలూరు టికెట్ ఆశించారు అయితే అక్కడ టికెట్ లభించకపోవడంతో ఏకంగా పార్టీ నే మారిపోయారు.. టిడిపి తీర్థం పుచ్చుకొని గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. మరొకవైపు గత కొన్ని సంవత్సరాలుగా టిడిపిని నమ్ముకుని టికెట్టు లభిస్తుందని ఆశ పెట్టుకున్న చాలామంది నేతలు గుమ్మనూరు టికెట్ దక్కించుకోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పార్టీ మారకముందే గుమ్మనూరు గుంతకల్లు టిడిపి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు తెర వెనుక రాజకీయాలు చాలానే జరిగాయి అంటూ పార్టీ శ్రేణులు సైతం కామెంట్లు చేస్తున్నారు..


మరొకవైపు ఇన్ని నిరసనల మధ్య తాను గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గుమ్మనూరు.. ఇందుకు ప్రధాన కారణం గుంతకల్లులో 60 శాతానికి పైగా వాల్మీకిలు ఉండడమే అని చెప్పవచ్చు.. గుమ్మనూరు జయరాం కు వాల్మీకి సామాజిక వర్గ ప్రజలు అండగా ఉన్న నేపథ్యంలో తనదే విజయం అంటూ గుమ్మనూరు ఆశాభవం వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ జితేంద్ర గౌడ్ టికెట్ లభించకపోవడంతో చాలామంది పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి..  వైసీపీ తరఫున వై. వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈయన కూడా ఇక్కడ గెలవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీకి నమ్మకద్రోహం చేసి సీటు ఇవ్వలేదని మళ్లీ ఇక్కడికి వచ్చారు అంటూ గుమ్మనూరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వై వెంకట్రాంరెడ్డి. మరి హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>