PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/these-are-the-ministers-who-are-going-to-be-defeated-by-the-alliance2777712c-3542-4942-a49d-6146552fc947-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/these-are-the-ministers-who-are-going-to-be-defeated-by-the-alliance2777712c-3542-4942-a49d-6146552fc947-415x250-IndiaHerald.jpg- ఓటమి బాటలో పలువురు మంత్రులు - గట్టిగా చూపుతున్న కూటమి ప్రభావం - అమాత్యుల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమి గట్టి ప్రభావం చూపుతోంది. దీనికి తోడు.. మంత్రులపై జనంలో ఉన్న ఆగ్రహం.. తమకేమీ చేయలేదన్న కోపం ఈ ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం గణనీయంగా కనిపిస్తోంది. కూటమి దెబ్బతో పలువురు మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు. మరి కూటమి దెబ్బకు ఓడిపోయే మంత్రులు ఎవరు.. ఏ మంత్రి పరిస్థితి ఎలా ఉంది.. అనే అంశంపై ఇండియా హెరాల్డ్‌ డీటైయిల్డ్ ఎక్లూజివ్‌ స్టోరీAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ministers ; Gudivada Amarnath; tanathi vanitha; ycp{#}Godavari River;PUSHPASREEVANI PAMULA;DHARMANA PRASADA RAO;DADISETTI RAJA;GANTA SRINIVASA RAO;Vijayawada;West Godavari;krishna district;kakinada;Tadepalli;Rajahmundry;Gajuwaka;krishna;Minister;India;Bharatiya Janata Party;Nani;Kodali Naniకూటమి దెబ్బకు ఓడిపోబోతున్న మంత్రులు వీళ్లే..?కూటమి దెబ్బకు ఓడిపోబోతున్న మంత్రులు వీళ్లే..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ministers ; Gudivada Amarnath; tanathi vanitha; ycp{#}Godavari River;PUSHPASREEVANI PAMULA;DHARMANA PRASADA RAO;DADISETTI RAJA;GANTA SRINIVASA RAO;Vijayawada;West Godavari;krishna district;kakinada;Tadepalli;Rajahmundry;Gajuwaka;krishna;Minister;India;Bharatiya Janata Party;Nani;Kodali NaniSat, 04 May 2024 11:48:47 GMT- ఓటమి బాటలో పలువురు మంత్రులు
- గట్టిగా చూపుతున్న కూటమి ప్రభావం
- అమాత్యుల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమి గట్టి ప్రభావం చూపుతోంది. దీనికి తోడు.. మంత్రులపై జనంలో ఉన్న ఆగ్రహం.. తమకేమీ చేయలేదన్న కోపం ఈ ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం గణనీయంగా కనిపిస్తోంది. కూటమి దెబ్బతో పలువురు మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు. మరి కూటమి దెబ్బకు ఓడిపోయే మంత్రులు ఎవరు.. ఏ మంత్రి పరిస్థితి ఎలా ఉంది.. అనే అంశంపై ఇండియా హెరాల్డ్‌ డీటైయిల్డ్ ఎక్లూజివ్‌ స్టోరీ చదవండి.


గ్యారంటీగా ఓడిపోయవారిలో గోదావరి ప్రాంతంలో ఎక్కువగా మంత్రులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, గోపాలపురంలో తానేటి వనిత, తాడేపల్లి గూడెంలో కొట్టు సత్యనారాయణ.. ఈ ముగ్గురూ తప్పకుండా ఓడిపోయే జాబితాలో ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నానికి కూడా  ఓటమి తప్పేలా లేదు. వీరి ఓటమి దాదాపు ఖాయమైనట్టే.


కాకినాడ రూరల్‌లో మాజీ మంత్రి కన్నబాబు గట్టి పోటీ ఇస్తున్నారు. రాజమండ్రి రూరల్‌లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూటమి అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈయన గెలిచే అవకాశం కూడా ఉంది. అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్‌కు ఓటమి ఖాయమని ఇండియా హెరాల్డ్ గ్రౌండ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. తునిలో దాడిశెట్టి రాజా పరిస్థితి బాగానే ఉంది. ఈయన గెలిచే అవకాశం కనిపిస్తోంది.  ఇక్కడ కూటమి బలంగానే ఉన్నా.. యనమల కుటుంబంపై ఉన్న వ్యతిరేకతే దాడిశెట్టి రాజాను ఒడ్డున పడేయనుంది.


ఇక విశాఖలో మంత్రి గుడివాడ అమరనాథ్‌ గాజువాక నుంచి ఓడిపోతున్నారు. స్థానం మారినా ఓటమి తప్పే పరిస్థితి లేదు. భీమిలిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌.. గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోబోతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఎదురీదుతున్నారు. అయితే కొద్దిపాటి తేడాతో ఆయన గెలిచే అవకాశం ఉందని ఇండియా హెరాల్డ్ గ్రౌండ్‌ రిపోర్ట్‌ చెబుతోంది.  
సాలూరులో పీడిక రాజన్నదొర, కురుపాంలో పాముల పుష్ప శ్రీవాణి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీరిద్దరూ గెలిచే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు పరిస్థితి మొదట్లో ఉన్నా.. ఇప్పుడు అక్కడ ఎదురీదుతున్నారు.
 

కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ జోగి రమేశ్‌ పెనమలూరులో ఓటమి బాటలో ఉన్నారు. మొదటి టర్మ్‌లో మంత్రిగా చేసిన కొడాలి నాని గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈయన స్వల్ప తేడాతే బయటపడే అవకాశం కనిపిస్తోంది. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తన కొడుకు పేర్ని కిట్టుకు టికెట్‌ ఇప్పించుకున్నారు. ఇక్కడ కిట్టూ ఒటమి తప్పదని ఇండియా హెరాల్డ్ గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది. విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి వెలంపల్లికి గెలుపు ఆశలు లేకపోయినా.. ఇక్కడ సీపీఎం అభ్యర్థి గెలిచే ఓట్లు కీలకం కానున్నాయి. సీపీఎం పుణ్యమా అని బయటపడకపోతానా అని వెలంపల్లి ఆశలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>