MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kl-narayana2286bd1a-9111-4a70-8ad0-b7df7bf4bfa5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kl-narayana2286bd1a-9111-4a70-8ad0-b7df7bf4bfa5-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కే ఎల్ నారాయణ నిర్మించబోతున్నాడు. ఇకపోతే తాజాగా కే ఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన రాజమౌళి వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా కే ఎల్ నారాయణ మాట్లాడుతూ ... రాజమౌళి ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప స్థాయి ఉన్న దర్శకులలో ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ మూవీ లు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందkl narayana{#}Varsham;Bahubali;producer;Producer;Rajamouli;september;Interview;mahesh babu;Cinemaఇచ్చిన మాట కోసం రాజమౌళి నిలబడ్డాడు... కేఎల్ నారాయణ..!ఇచ్చిన మాట కోసం రాజమౌళి నిలబడ్డాడు... కేఎల్ నారాయణ..!kl narayana{#}Varsham;Bahubali;producer;Producer;Rajamouli;september;Interview;mahesh babu;CinemaSat, 04 May 2024 12:44:06 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కే ఎల్ నారాయణ నిర్మించబోతున్నాడు. ఇకపోతే తాజాగా కే ఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన రాజమౌళి వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా కే ఎల్ నారాయణ మాట్లాడుతూ ... రాజమౌళి ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప స్థాయి ఉన్న దర్శకులలో ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ మూవీ లు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయి.

మూవీ ల తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో మంది పెద్ద పెద్ద నిర్మాతలు ముందుకు వచ్చారు. కాకపోతే ఆయన 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట కోసం నిలబడ్డారు. నాతో సినిమా చేస్తున్నారు. నేను అడక్కపోయినా కూడా నా బ్యానర్ లో సినిమా చేస్తున్నట్లు రాజమౌళి అనౌన్స్ చేశారు. అలా ఎప్పుడూ ఇచ్చిన మాట కోసం రాజమౌళి నిలబడ్డాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని నిర్మాత కె ఎల్ నారాయణ తాజాగా రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించాడు.

అలాగే ఈ సినిమా కోసం బడ్జెట్ ఇంకా ఏమీ అనుకోలేదు అని , కాకపోతే సినిమాకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీగా ఉన్నట్లు కేఎల్ నారాయణ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే కేఎల్ నారాయణ ... మహేష్ , రాజమౌళి కాంబో మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు కూడా తెలియజేశారు. ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>