EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu83d51152-bbd8-402b-a7fb-4c9f0321abc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu83d51152-bbd8-402b-a7fb-4c9f0321abc5-415x250-IndiaHerald.jpgఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల మధ్య ఏదో తెలియని అగాథం కనిపిస్తోంది. పోలింగ్ కు పది రోజుల మాత్రమే సమయం ఉండటంతో ఈ అగాథం కూటమికి మైనస్ గా మారే అవకాశం ఉంది. ముస్లిం రిజర్వేషన్ల తుట్టెను కదిపితే.. మొదటికే మోసం వస్తుందని గ్లాజ్, సైకిల్ పార్టీలు భయపడుతున్నాయి. మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి బీజేపీ హాజరై తమ మద్దతు ఉందని ప్రకటించినా.. అవన్నీ పైపై మాటలేనని అర్థం అయింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన ఏపీ పరిశీలకుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ దీనిని పట్టుకునేందుకు నిరాకరించాడు. ఇదే అంశాన్నిchandrababu{#}Siddharth;Amith Shah;Cycle;Narendra Modi;Janasena;Party;Bharatiya Janata Party;Pawan Kalyan;CBN;House;CM;YCP;Andhra Pradeshముస్లిం రిజర్వేషన్లు: చంద్రబాబు గుండెల్లో పేలుతున్న డైనమేట్లు?ముస్లిం రిజర్వేషన్లు: చంద్రబాబు గుండెల్లో పేలుతున్న డైనమేట్లు?chandrababu{#}Siddharth;Amith Shah;Cycle;Narendra Modi;Janasena;Party;Bharatiya Janata Party;Pawan Kalyan;CBN;House;CM;YCP;Andhra PradeshSat, 04 May 2024 10:00:00 GMTఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల మధ్య ఏదో తెలియని అగాథం కనిపిస్తోంది. పోలింగ్ కు పది రోజుల మాత్రమే సమయం ఉండటంతో ఈ అగాథం కూటమికి మైనస్ గా మారే అవకాశం ఉంది.  ముస్లిం రిజర్వేషన్ల తుట్టెను కదిపితే.. మొదటికే మోసం వస్తుందని గ్లాజ్, సైకిల్ పార్టీలు భయపడుతున్నాయి.


మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి బీజేపీ హాజరై తమ మద్దతు ఉందని ప్రకటించినా.. అవన్నీ పైపై మాటలేనని అర్థం అయింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన ఏపీ పరిశీలకుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ దీనిని పట్టుకునేందుకు నిరాకరించాడు. ఇదే అంశాన్ని వైసీపీ అస్త్రంగా మలచుకొని ప్రచారం మొదలు పెట్టింది. మ్యానిఫెస్టోకి బీజేపీ సపోర్ట్ లేదు. చంద్రబాబు హామీలను నరంద్ర మోదీ నమ్మడం లేదు అంటూ సీఎం జగన్ విమర్శించడం మొదలు పెట్టారు.


ఇదిలా ఉండగా.. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించడం కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలను ఇరుకున పడేసింది. దీంతో ఈ రెండు పార్టీలను కూడా మతతత్వ పార్టీలుగా పేర్కొంటూ వైసీపీ రెచ్చగొట్టడం ప్రారంభించింది. దీంతో సహజంగానే అప్పటికే కాస్తో కూస్తో ముస్లిం ఓట్లున్న ఈ రెండు పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ నష్టం నుంచి తప్పించుకునేందుకు ఎక్కడిక్కక్కడ చంద్రబాబు ముస్లిం సంఘాలతో కుల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.


తమ ఉమ్మడి మ్యానిఫెస్టోలో కూడా హజ్ యాత్రకు రూ.లక్ష సాయం, 50 ఏళ్లకే రిజర్వేషన్, పింఛన్లు, హజ్ హౌస్ నిర్మాణం వంటి హామీలు ఇవ్వడం ద్వారా తాము ముస్లింలను విస్మరించలేదనే సంకేతాలను పంపించేందుకు టీడీపీ, జనసేన లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీజేపీ లెక్కలు వేరు. ఇప్పుడు ఏపీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే.. ఉత్తరాదిలో ఆ పార్టీకి దెబ్బ పడుతుంది. అందుకే రిజర్వేషన్ల విషయంలో కాషాయ పార్టీ కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లలో ఒకరకమైన టెన్షన్ మొదలైంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>