PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-nagari-tdp-ycp-murali-darreddy-e3031682-2234-4ac7-9ac7-fc204ab459c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-nagari-tdp-ycp-murali-darreddy-e3031682-2234-4ac7-9ac7-fc204ab459c6-415x250-IndiaHerald.jpgప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గం నగరి. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నటువంటి మంత్రి రోజా మరోసారి పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. మరోసారి అక్కడ గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని ఎంతో ట్రై చేస్తున్నటువంటి రోజాకు పార్టీ నుంచి ఎదురుగాలి వీస్తోందట. నేతలంతా ఆమె తీరును నిరసిస్తూ ఒక్కొక్కరు పార్టీని వీడి బయటకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా రోజా రెక్కలు ఒక్కొక్కటిగా రాలిపోతుంటే రోజాకు నియోజకవroja;nagari;tdp;ycp;murali darreddy ;{#}bhaskar;Roja;Muralidhar Rao;రాజీనామా;Baba Bhaskar;Srisailam;Petta;Yevaru;Director;Andhra Pradesh;Reddy;MLA;Minister;CM;YCP;Elections;Partyఏపీ: నగరిలో రాలుతున్న "రోజా" రెక్కలు..!ఏపీ: నగరిలో రాలుతున్న "రోజా" రెక్కలు..!roja;nagari;tdp;ycp;murali darreddy ;{#}bhaskar;Roja;Muralidhar Rao;రాజీనామా;Baba Bhaskar;Srisailam;Petta;Yevaru;Director;Andhra Pradesh;Reddy;MLA;Minister;CM;YCP;Elections;PartySat, 04 May 2024 21:15:43 GMTప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గం నగరి. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నటువంటి మంత్రి రోజా మరోసారి పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. మరోసారి అక్కడ గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని  ఎంతో ట్రై చేస్తున్నటువంటి రోజాకు  పార్టీ నుంచి ఎదురుగాలి వీస్తోందట. నేతలంతా ఆమె తీరును నిరసిస్తూ ఒక్కొక్కరు పార్టీని వీడి బయటకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా రోజా రెక్కలు ఒక్కొక్కటిగా రాలిపోతుంటే రోజాకు నియోజకవర్గంలో గెలుస్తానా గెలవన అనే బెంగ పట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది. ఎవరు పార్టీని వీడారు అనే వివరాలు చూద్దాం.. 

ఎన్నికలు వచ్చాయి అంటే చాలు పార్టీల నాయకులు  అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వారి అవసరాలకు తగ్గట్టు మారుతూ ఉంటారు. ఆ విధంగానే మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో కూడా  తన ముఖ్యమైన అనుచరులు పార్టీని వదిలి వెళ్లిపోయారట. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీశైలం దేవాలయ మాజీ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డి వారి భాస్కర్ రెడ్డి , లక్ష్మీపతి రెడ్డి, వడమాల పేట జెడ్పిటిసి సభ్యులు మురళీధర్ రెడ్డి  అలాగే డిసిసిబి మాజీ డైరెక్టర్ , ఆరుగురు సర్పంచులు పార్టీకి రాజీనామా చేశారట. వీరు ఇలా వైసిపిని వీడి వెళ్లడానికి ప్రధాన కారణం మంత్రి రోజా అని వారికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదని, ఆమె గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని అయినా ఈ ఎన్నికల్లో మమ్మల్ని పట్టించుకోవడంలేదని ఆలోచనతో వారు  వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే రోజాకి ఈసారి టికెట్ ఇస్తే ఓడిపోతుందని మేము అధిష్టానానికి  ఎన్నోసార్లు విన్నవించామని, అయినా ఆమెకే టికెట్ ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

  నియోజకవర్గంలో మంత్రి రోజా సోదరుల పెత్తనం ఎక్కువైందని  వీరు వైయస్సార్సీపీ నేతలను, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారన్నారు. మంత్రి రోజా అవినీతి అక్రమాలకు  పాల్పడుతోందని విమర్శించారు. మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని అయినా మమ్మల్ని పట్టించుకోవడంలేదని రాజీనామా చేసినట్టు వారు తెలియజేశారు. ముఖ్యంగా ఏపీఐఐసీ భూముల్లో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి  విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ లో కూడా రోజా కమిషన్లు వారు తెలియజేసినట్లు సమాచారం. అంతేకాకుండా నగరిలో మంత్రి రోజాను ఓడించడం కోసం  మీరంతా  సిద్ధంగా ఉండాలని రెడ్డి వారి చక్రపాణి రెడ్డి  ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఇన్నాళ్లు రోజా వెంటే ఉన్న వీరంతా తిరుగుబాటు చేయడంతో రోజాకి ఈసారి ఎక్కడ గెలుపు కష్టమే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>