MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgశ్రీరస్తు శుభమస్తు’ మూవీ వరకు పరుశురామ్ చిన్న సినిమాల దర్శకుడు అయితే ఆతరువాత ‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ అవ్వడంతో ఒక్కరోజులో అతడు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. విజయ్ దేవరకొండ లాంటి హీరోని పెట్టుకుని పరుశురామ్ చేసిన సాహసం విజయవంతం కావడంతో అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు అదేవిధంగా అనేకమంది హీరోలు పరుశురామ్ తో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరిచారు. అనేక ప్రొడక్షన్ హౌస్ లు పరుశురం కు భారీ అడ్వాన్సులు కూడ ఇచ్చాయి ని అంటారు. అలాంటి పరిస్థితులలో అతడు ఊహించని విధంగామహేశ్ తో ‘సర్కారు వారి పాట’ చేసే అవకాశparusuraam{#}parasuram;vijay deverakonda;Joseph Vijay;ram pothineni;Athadu;Naga Chaitanya;Dil;Darsakudu;Director;House;Cinemaపరుశురామ్ కష్టాలు !పరుశురామ్ కష్టాలు !parusuraam{#}parasuram;vijay deverakonda;Joseph Vijay;ram pothineni;Athadu;Naga Chaitanya;Dil;Darsakudu;Director;House;CinemaSat, 04 May 2024 13:48:37 GMTశ్రీరస్తు శుభమస్తు’ మూవీ వరకు పరుశురామ్ చిన్న సినిమాల దర్శకుడు అయితే ఆతరువాత ‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ అవ్వడంతో ఒక్కరోజులో అతడు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. విజయ్ దేవరకొండ లాంటి హీరోని పెట్టుకుని పరుశురామ్ చేసిన సాహసం విజయవంతం కావడంతో అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు అదేవిధంగా అనేకమంది హీరోలు పరుశురామ్ తో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరిచారు.



అనేక ప్రొడక్షన్ హౌస్ లు పరుశురం కు భారీ అడ్వాన్సులు కూడ ఇచ్చాయి ని అంటారు. అలాంటి పరిస్థితులలో అతడు ఊహించని  విధంగామహేశ్ తో ‘సర్కారు వారి పాట’ చేసే అవకాశం అతడికి లభించంతో ఈ దర్శకుడు దశ తిరిగినట్లే అనుకున్నారు. అయితే ఆమూవీ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో అతడికి అడ్వాన్స్ లు ఇచ్చిన చాలమంది ఈ దర్శకుడితో సినిమాలు తీయడానికి వెనకడుగు వేశారు అన్న గాసిప్పులు వచ్చాయి.



ఆతరువాత నాగచైతన్య తో అతడు తీయవలసిన సినిమా కొన్ని కారణాలతో ఆగిపోవడంతో పరుశురామ్ కు మరన్ని కష్టాలు మొదలయ్యాయి. అలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ నిర్మాణంలో విజయ్ దేవరకొండతో తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పరుశురామ్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడని చాలామంది భావించారు. ఈ సినిమాలోని లాజిక్ లెస్ సీన్లు అర్థరహితమైన డైలాగుల పట్ల తీవ్ర విమర్శలు రావడంతో ఈ సినిమా ఫెయిల్ అవ్వాడమే కాకుండా పరుశురామ్ మరిన్ని కష్టాలు వచ్చాయి.



ప్రస్తుతం అతడు ఏహీరోతో సినిమా చేయాలి అని భావిస్తున్నప్పటవకీ ఆహీరోలు పరుశురామ్ తో సినిమా చేయడానికి ఆశక్తి కనపరచడం లేదు అంటూ గాసిప్పులు గుప్పు మంటున్నాయి. ఈమధ్య కాలంలో ఈ దర్శకుడు హీరో రామ్ ను కలిసి ఒక కథ చెప్పాడు అని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఫ్లాప్ లలో కొనసాగుతున్న రామ్ ఇలాంటి పరిస్థితులలో పరుశురామ్ ను నమ్మి అవకాశం ఇస్తాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి పరుశురామ్ కాలం ఎలా కలిసి వస్తుందో చూడాలి..    






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>