Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaf619e5c-143d-4853-b2cb-9c45199b7119-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaf619e5c-143d-4853-b2cb-9c45199b7119-415x250-IndiaHerald.jpgబాహుబలి తో తెలుగు మూవీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నటించిన ఈ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ తో హాలీవుడ్ మేకర్స్ మెప్పు పొందాడు. ఈ మూవీతో ఆస్కార్ వేదికగా సత్తా చాటాడు. దీంతో ఇప్పుడు తెలుగు వైపు ప్రపంచమంతా చూస్తోంది. అలాంటి స్టార్ డైరెక్టర్ తమ పై ప్రశంసలు కురిపిస్తే ఎలా ఉంటుంది.లేటెస్ట్గా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే..రాజమౌళి తనsocialstars lifestyle{#}anoushka;karthikeya;kartikeya;Rajamouli;Hollywood;Letter;Chandu Mondeti;Oscar;Santosham;Telugu;Instagram;media;Smart phone;Cinema;Director;Indiaరాజమౌళి రాసిచ్చిన లెటర్‌ని.. ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..!!రాజమౌళి రాసిచ్చిన లెటర్‌ని.. ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..!!socialstars lifestyle{#}anoushka;karthikeya;kartikeya;Rajamouli;Hollywood;Letter;Chandu Mondeti;Oscar;Santosham;Telugu;Instagram;media;Smart phone;Cinema;Director;IndiaSat, 04 May 2024 22:45:00 GMTబాహుబలి తో తెలుగు మూవీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నటించిన ఈ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ తో హాలీవుడ్ మేకర్స్ మెప్పు పొందాడు. ఈ మూవీతో ఆస్కార్ వేదికగా సత్తా చాటాడు. దీంతో ఇప్పుడు తెలుగు వైపు ప్రపంచమంతా చూస్తోంది. అలాంటి స్టార్ డైరెక్టర్ తమ పై ప్రశంసలు కురిపిస్తే ఎలా ఉంటుంది.లేటెస్ట్గా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే..రాజమౌళి తన సినిమాలే కాకుండా..ఇండస్ట్రీలో ఏ సినిమా బాగున్నా..దాన్ని కథ కథనాలను మెచ్చుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు.రాజమౌళి ఒక సినిమాని కాని, దర్శకుడిని కాని మెచ్చుకున్నాడు అంటే అందులో విషయం ఉన్నట్టే. అయితే గతంలో రాజమౌళిడైరెక్టర్ ని మెచ్చుకోవడమే కాదు సినిమా రిలీజ్ కి ముందు ప్రేమగా ఒక లెటర్ కూడా రాసిచ్చాడు అంట.ఆ డైరెక్టర్ చందూ మొండేటి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చందూ మొండేటి ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

 కార్తికేయ సినిమా అప్పుడు నిఖిల్ తప్ప అందరం కొత్తవాళ్లే. సినిమా మీద అంత బజ్ కూడా లేదు. కాని టీజర్ రిలీజ్ అయ్యాక రాజమౌళి గారికి నచ్చి బాగుందని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఎవరో ఫోన్ చేసి చెప్తే చూశాను. సినిమా హిట్ అయిన దానికంటే ఎక్కువ హ్యాపినెస్ అనిపించింది. రాజమౌళి గారు మా సినిమా గురించి పోస్ట్ వేయడంతో ఒక్కసారిగా మా సినిమాపై బజ్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ ముందు కార్తికేయ హిట్ అవుతుందని, నా వర్క్ ని ప్రశంసిస్తూ, టీజర్, ట్రైలర్స్ ని అభినందిస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్ ని ఫ్రేమ్ కట్టుకొని మరీ పెట్టుకున్నాను. సినిమా రిలీజ్ ముందే రాజమౌళి గారిని ఇంప్రెస్ చేయడం, అది కూడా నా మొదటి సినిమాకి అంటే అంతకంటే పెద్ద సంతోషం లేదనిపించింది అని తెలిపారు.రాజమౌళి గతంలోనే కాదు ఇప్పటికి తనకి ఏదైనా టీజర్, ట్రైలర్, సినిమా నచ్చితే, ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతారు, వాటి గురించి సోషల్ మీడియాలో పంచుకుంటారు..చందూ మొండేటి ప్రస్తుతం తండేల్ సినిమా తో బిజీగా ఉండగా రాజమౌళి మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చందూ మొండేటి టాలీవుడ్ టైర్1 హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుండగా ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. రాజమౌళి గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>