Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bb28932-1c77-47a3-b103-84c4e64d4e4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bb28932-1c77-47a3-b103-84c4e64d4e4e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే బిరుదును సొంతం చేసుకుని ప్రస్తుతం ఎటువంటి సినిమాలలో కూడా నటించని ఏకైక హీరోయిన్గా మిగిలిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే.టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ఒకప్పుడు టాలీవుడ్ నే ఓ ఊపు ఉపేసింది. ఈ ముద్దుగుమ్మ కోసం స్టార్ హీరోలు కూడా డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు.ఈ మధ్య కాలంలో ఈ బుట్టబొమ్మ జోరు తెలుగులో తగ్గింది. వరుస హిట్స్ అందుకున్న పూజా .. ఇప్పుడు వరుసగా ఫ్లాపులు రావడంతో పూజా హెగ్డేను తెలుగు మsocialstars lifestyle{#}BEAUTY;Nani;Pooja Hegde;Salman Khan;Allu Arjun;atlee kumar;trivikram srinivas;Makar Sakranti;Guntur;Tollywood;Telugu;Blockbuster hit;Iron;Box office;Hero;Joseph Vijay;Duvvada Jagannadham;Cinema;Director;Newsపూజా హెగ్డే కి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా టిల్లు గాడు..!!పూజా హెగ్డే కి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా టిల్లు గాడు..!!socialstars lifestyle{#}BEAUTY;Nani;Pooja Hegde;Salman Khan;Allu Arjun;atlee kumar;trivikram srinivas;Makar Sakranti;Guntur;Tollywood;Telugu;Blockbuster hit;Iron;Box office;Hero;Joseph Vijay;Duvvada Jagannadham;Cinema;Director;NewsSat, 04 May 2024 17:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే బిరుదును సొంతం చేసుకుని ప్రస్తుతం ఎటువంటి సినిమాలలో కూడా నటించని ఏకైక హీరోయిన్గా మిగిలిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే.టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ఒకప్పుడు టాలీవుడ్ నే ఓ ఊపు ఉపేసింది. ఈ ముద్దుగుమ్మ కోసం స్టార్ హీరోలు కూడా డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు.ఈ మధ్య కాలంలో ఈ బుట్టబొమ్మ జోరు తెలుగులో తగ్గింది. వరుస హిట్స్ అందుకున్న పూజా .. ఇప్పుడు వరుసగా ఫ్లాపులు రావడంతో పూజా హెగ్డేను తెలుగు మేకర్లు అంతగా పట్టించుకోవడం లేదు.

తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మకు అంతగా ఆఫర్లు రావడం లేదనిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఆఫర్లు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో చేసిన మూవీ డిజాస్టర్ అయింది. విజయ్ బీస్ట్ కూడా హిట్ అందుకోకపోవడంతో పూర్తిగా ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో బుట్టబొమ్మ పేరు విని చాలా కాలం అవుతుంది.నిత్యం ఈమె పై సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసింది.. ఈ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసింది అంటూ వార్తలు వినిపించడమే కానీ ఎటువంటి సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించడం లేదు. ఇక ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో ఈమెని మొదటిగా ఎంచుకున్నారు. కానీ ఈ బ్యూటీ కి డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.నిజానికి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుని పూజ మంచి పని చేసిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఒకవేళ పూజ హెగ్డే కనుక ఈ సినిమాలో నటించి ఉంటే పూజ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అనే వార్తలు కూడా వినిపించావి. అందువల్ల ఈ బ్యూటీ ఈ మూవీలో నుంచి తెలియకుండా తప్పుకుని మంచి పనే చేసింది. ఇక కెరీర్ ప్రారంభంలో అగ్ర హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.తరువాత ఈమెకి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. బుట్ట బొమ్మ ఇటీవలే ఫామ్ లోకి వచ్చేటట్లు కనిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా నాని హీరోగా ఓజీ డైరెక్టర్ సుజిత్ ఓ మూవీ చేయబోతున్నారు. ఇందులో కూడా పూజను కథానాయకగా ఎంపిక చేసుకునే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో పూజకు మరో ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

యంగ్ హీరో సిద్దు హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్స్ రాబట్టి ఎంతటి దుమారం రేపాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో ఈ మూవీకి మూడవ భాగం కూడా తీసుకురానున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. టిల్లు క్యూబ్ పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. కాగా కథానాయకగా బుట్ట బొమ్మను సెలెక్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట మూవీ టీం. టిల్లు సినిమాతో బుట్ట బొమ్మ దశ తిరగనుందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>