Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl32f8c196-51ec-467e-b73e-bb68c17fc666-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl32f8c196-51ec-467e-b73e-bb68c17fc666-415x250-IndiaHerald.jpgఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంత దూకుడైన ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ టీం ఏకంగా 8 విజయాలతో ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయింది. అయితే ఇటీవల ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్Ipl{#}Uppal;Parugu;Dookudu;Rajasthan;Hyderabadసన్రైజర్స్ తో మ్యాచ్ లో.. రాజస్థాన్ అసలు వీక్నెస్ బయటపడింది?సన్రైజర్స్ తో మ్యాచ్ లో.. రాజస్థాన్ అసలు వీక్నెస్ బయటపడింది?Ipl{#}Uppal;Parugu;Dookudu;Rajasthan;HyderabadFri, 03 May 2024 17:00:00 GMTఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంత దూకుడైన ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రత్యర్థి  జట్టు ఎవరైనా సరే వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో  అగ్రస్థానంలో కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ టీం ఏకంగా 8 విజయాలతో ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయింది.


 అయితే ఇటీవల ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న సన్రైజర్స్ టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న రాజస్థాన్ జట్టును ఓడించగలగా లేదా అనే విషయంపై అందరూ చర్చించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరికి ఒక్క పరుగు తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తమ అసలు బలహీనత ఏంటి అన్న విషయాన్ని బయట పెట్టుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు.


 అయితే ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు గత ఐదు మ్యాచ్లలో కూడా రాజస్థాన్ పరిస్థితి ఇలాగే ఉంది. కానీ సన్రైజర్స్ తో ఓడిపోవడంతో ఈ బలహీనత అందరికీ అర్థం అయిపోయింది. అయితే రానున్న మ్యాచ్లో ఇదే బలహీనతతో రాజస్థాన్ ముందుకు సాగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలుత  హైదరాబాద్ బ్యాట్స్మెన్ లను కట్టడి చేసిన రాజస్థాన్ బౌలర్లు.. ఆ తర్వాత మాత్రం ఇక హైదరాబాద్ బ్యాటర్ల దూకుడు ముందు సరెండర్ అయిపోయారు. అయితే రాజస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్ యూనిట్ చాలా బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా  స్పిన్నర్స్ ఓవరాల్ ఎకానామి రేటు దారుణంగా పడిపోయింది. ఇప్పటినుంచి కాదు 2022 నుంచి కూడా రాజస్థాన్ జట్టులో ఉన్న స్పిన్నర్లు దారుణంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం బ్యాటింగ్, ఫేస్ యూనిట్ బలంతోనే రాజస్థాన్ నెట్టుకొస్తున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ స్పిన్ బౌలర్లు 9.80 ఎకానమీ రేట్ నమోదు చేయడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>