EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/reservationseb037b21-5650-4a30-83e8-ffa20ee4d736-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/reservationseb037b21-5650-4a30-83e8-ffa20ee4d736-415x250-IndiaHerald.jpgలోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, ప్రధాన ప్రతిపక్ష ఇండియా కూటమిలు వరుసగా హామీలను గుప్పిస్తున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ లో ఉన్న అంశం ముస్లిం రిజర్వేషన్లు. ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా ఇస్తారని మోదీ మండిపడుతున్నారు. 1990 నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేస్తోందన్నారు. ముస్లిలందర్నీ ఓబీసీలుగా వర్గీకరించారు. అదే reservations{#}advertisement;Amit Shah;Population;India;Narendra Modi;Elections;Amith Shah;Prime Minister;Congressమోదీ, రేవంత్‌: మతాలపరంగా రిజర్వేషన్లు.. ఉండాలా వద్దా?మోదీ, రేవంత్‌: మతాలపరంగా రిజర్వేషన్లు.. ఉండాలా వద్దా?reservations{#}advertisement;Amit Shah;Population;India;Narendra Modi;Elections;Amith Shah;Prime Minister;CongressFri, 03 May 2024 11:00:00 GMTలోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, ప్రధాన ప్రతిపక్ష ఇండియా కూటమిలు వరుసగా హామీలను గుప్పిస్తున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ లో ఉన్న అంశం ముస్లిం  రిజర్వేషన్లు. ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా ఇస్తారని మోదీ మండిపడుతున్నారు.


1990 నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేస్తోందన్నారు. ముస్లిలందర్నీ ఓబీసీలుగా వర్గీకరించారు. అదే సమయంలో ఓబీసీల డిమాండ్లను తిరస్కరించి.. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలకు రిజర్వేషన్లను కాంగ్రెస్ కల్పించింది. 2004లో రాజ్యాంగం ద్వారా ఓబీసీ కమ్యూనిటీకి ఇచ్చిన 27శాతం రిజర్వేషన్లను ఉల్లంఘించడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. 2011లో మరోసారి ముస్లిం రిజర్వేషన్లను ప్రతిపాదించి వాటిని అమలు చేశారు. కానీ ఇలా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిచడం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.


ఎందుకంటే తాజాగా అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కేటాయిస్తామని చెప్పారు. దీనిని కాంగ్రెస్ కాస్తా మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. ఇది వైరల్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. దీంతో మేం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.


వైఎస్ అమలు చేసిన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్  షా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా భవిష్యత్తులో క్రిష్టియన్ రిజర్వేషన్లు, హిందూ రిజర్వేషన్లు కావాలని ఆయా మతాల వారు ఆందోళనల చేస్తే.. జనాభా పరంగా వీటిని విడదీస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. మొత్తం మీద దీనిపై అర్థవంతమైన చర్చ మతాల వారీగా రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనేది తేల్చితే భవిష్యత్తు తరాల వారికి మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>