PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/mudragada-padmanabham-kranthi-pawan-kalyan-pithapuram-ycpccf19260-2844-46aa-8ed8-9d8247982b33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/mudragada-padmanabham-kranthi-pawan-kalyan-pithapuram-ycpccf19260-2844-46aa-8ed8-9d8247982b33-415x250-IndiaHerald.jpgపిఠాపురం రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క అయితే పిఠాపురం మరో లెక్కగా మారింది. పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా పిఠాపురంలో పాగా వేసి తన రాజకీయ చరిష్మా ఏంటో చూపించుకోవాలనుకుంటున్నారు. కానీ పవన్ ని వైసిపి అడుగడుగునా అడ్డుకుంటూ కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తోంది. వారు ఎంత ఆపుతున్నారో పవన్ కు అంతకు రెట్టింపు హైప్ పెరుగుతోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికను చాలా చాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇది గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా పోయినట్టేMudragada padmanabham;Kranthi;Pawan kalyan;Pithapuram;YCP{#}pithapuram;kranthi;Father;Elections;Andhra Pradesh;kranti;Mudragada Padmanabham;kalyan;Jagan;Janasena;YCPఏపీ:పిఠాపురంలో పవన్ ను గెలిపించేది ముద్రగడేనా..?ఏపీ:పిఠాపురంలో పవన్ ను గెలిపించేది ముద్రగడేనా..?Mudragada padmanabham;Kranthi;Pawan kalyan;Pithapuram;YCP{#}pithapuram;kranthi;Father;Elections;Andhra Pradesh;kranti;Mudragada Padmanabham;kalyan;Jagan;Janasena;YCPFri, 03 May 2024 14:04:08 GMTపిఠాపురం రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క అయితే  పిఠాపురం మరో లెక్కగా మారింది. పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా పిఠాపురంలో పాగా వేసి  తన రాజకీయ  చరిష్మా ఏంటో చూపించుకోవాలనుకుంటున్నారు. కానీ పవన్ ని వైసిపి అడుగడుగునా అడ్డుకుంటూ కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తోంది. వారు ఎంత ఆపుతున్నారో పవన్ కు అంతకు రెట్టింపు  హైప్ పెరుగుతోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఈ  ఎన్నికను చాలా చాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇది గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా పోయినట్టే. అందుకే ఈసారి పిఠాపురంలో  ఫుల్ టైం ఉంటూ  ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది సెలబ్రిటీలను కూడా అక్కడికి తీసుకువచ్చి ప్రచారం చేయిస్తున్నారు. దీంతో అక్కడ పవన్ కళ్యాణ్ కు హైప్ పెరిగిపోతుంది.

ఈ తరుణంలో వైసిపి నేత  ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. తనను ఈ నియోజకవర్గంలో నుంచి తన్ని తరిమేస్తా అంటూ  మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన మాటలపై  టిడిపి, జనసేన నాయకులు స్పందించలేదు. తన సొంత కూతురే ఆయనకు కౌంటర్ ఇచ్చింది. ముద్రగడ పద్మనాభం  కూతురు క్రాంతి తన తండ్రి చేస్తున్నది ఏ మాత్రం కరెక్ట్ కాదని, ఆయన మాట్లాడిన మాటలు ఏం బాగోలేదని  అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తన తండ్రికి కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం వైసీపీ నాయకులు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే మా నాన్నగారు పవన్ కళ్యాణ్  ని తన్ని తరమేస్తా అని అంటున్నారు. ఒకవేళ ఆయన  తన్ని తరిమేయకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని తెలియజేశారు.

 ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆ కాన్సెప్ట్ నాకు అస్సలు అర్థం కాలేదని అన్నారు. వంగ గీతాని గెలిపించడం కోసం  కష్టపడితే ఎవరూ అడ్డుకోరు. కానీ ఆయన అభిమానులను కించపరిచేలా  కామెంట్స్ చేస్తే మాత్రం బాగుండదు. కేవలం మా నాన్నను జగన్ రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మా నాన్నను ఎటూ కానీ ఎడారిలో పడేస్తారు. నేను నాన్న మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న అంటూ మాట్లాడింది.  అంటే వైసిపి నాయకులకు  పవన్ గెలుస్తారని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. దీంతో ఏదో ఒక విధంగా ఆయనకు అడ్డు కట్టవేయాలని ట్రై చేస్తున్నారు.కానీ కుదరకపోవడంతో అది వారికే రివర్స్ తగులుతుంది.  అంతేకాకుండా ప్రతిసారి పవన్ పై విమర్శలు చేస్తూ పవన్ ను హైలెట్ చేస్తూ వారి గౌరవాన్ని వారే తగ్గించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం  వైసిపి నేతలే పవన్ కు మరింత ప్రచారం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>