EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan6e722436-369e-4d99-9d55-2def27cf11c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan6e722436-369e-4d99-9d55-2def27cf11c7-415x250-IndiaHerald.jpgటీడీపీ నాయకులు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైసీపీ అధినేత సీఎం జగన్ రోజుకి మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఆ మూడు ప్రచార సభల్లోను ఆయన మాట్లాడిన దాంట్లో సగం టీడీపీ మ్యానిఫెస్టో గురించే ఉంటుంది. అదిపాత మ్యానిఫెస్టో కానీ.. కొత్త దాని గురించి కానీ.. కనీసం సగం సమయం దానికే వెచ్చిస్తున్నారు. 2014 మ్యానిఫెస్టో అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. దీనిపై వ్యతిరేకత వస్తుందని jagan{#}CBN;CM;Narendra Modi;TDP;Jagan;YCP;Bharatiya Janata Partyజగన్ చేతిలో బలమైన ఆయుధంగా.. బాబు 2014 మేనిఫెస్టో?జగన్ చేతిలో బలమైన ఆయుధంగా.. బాబు 2014 మేనిఫెస్టో?jagan{#}CBN;CM;Narendra Modi;TDP;Jagan;YCP;Bharatiya Janata PartyFri, 03 May 2024 07:49:00 GMTటీడీపీ నాయకులు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు.  అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైసీపీ అధినేత సీఎం జగన్ రోజుకి మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఆ మూడు ప్రచార సభల్లోను ఆయన మాట్లాడిన దాంట్లో సగం టీడీపీ మ్యానిఫెస్టో గురించే ఉంటుంది.


అదిపాత మ్యానిఫెస్టో కానీ.. కొత్త దాని గురించి కానీ.. కనీసం సగం సమయం దానికే వెచ్చిస్తున్నారు. 2014 మ్యానిఫెస్టో అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. దీనిపై వ్యతిరేకత వస్తుందని వెబ్ సైట్ నుంచి తీసేశారని చెబుతున్నారు. 2014 హామీ కాపీని పట్టుకొని ఇందుల్లో ఎన్ని అమలు అయ్యాయని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా అమలు సాధ్యం కానివనీ.. మళ్లీ చంద్రబాబుని నమ్మి ఓటేస్తే మోస పోవడం గ్యారంటీ అని విమర్శిస్తున్నారు.


మరోవైపు చంద్రబాబు గురించి తెలిసే.. నరేంద్ర మోదీ ఫొటో పెట్టడానికి బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పారని పేర్కొంటున్నారు. కూటమిలో ముగ్గురు ఉండి ఆ ముగ్గురి ఫొటోలు పెట్టే పరిస్థితి లేదని.. దీనిబట్టి ప్రజలను చంద్రబాబు ఏ మేర మోసం చేసేందుకు సిద్ధం అయ్యారో అర్థం చేసుకోవచ్చు అని దుయ్యపడుతున్నారు. అయితే మొత్తం మీద జగన్ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు అనిపిస్తోంది.


సిద్ధం సభల్లో ఓ తరహా స్ర్టాటజీని అమలు చేస్తే.. మేమంతా సిద్ధం ప్రచార సభల్లో కొత్త కోణాన్ని ఎంచుకున్నారు. తాము చేసింది చెబుతూ.. చంద్రబాబు ఏం చేయలేదో చెబుతున్నారు. అమలు కానీ హామీలు అంటూ వాటికి ఎంత ఖర్చవుతుందో లెక్కలేసి మరీ వివరిస్తున్నారు. చంద్రబాబు హామీలకు విశ్వసనీయత లేదని తూర్పారపడుతూ.. తద్వారా జనాల్లో ఒక ఆలోచనను రేకెత్తిస్తున్నారు. తాను చెప్పిందే చేస్తానని.. ఇచ్చిన మాట తప్పనని పదే పదే చెబుతూ.. చంద్రబాబు మాట తప్పుతారు అని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మరి ఇది ఏ మేర లాభం చేకూరుస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>