MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhasa5b50660-23a1-4bca-8350-45f4fc9d5efd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhasa5b50660-23a1-4bca-8350-45f4fc9d5efd-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు అందుకున్న తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్.. ఆయన హీరోగా వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ కి ఇప్పుడు అన్ని వైపులా మార్కెట్ పరిధి పెరుగుతూ ఉంది.ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా 150 కోట్ల వరకు వచ్చిన విషయం తెలిసిందే.ఒకవైపు తియేట్రికల్ గా మరొకవైపు నాన్ థియేట్రికల్ గా ప్రభాస్ బిజినెస్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలోPrabhas{#}Payal Rajput;krishnam raju;Kesari;vegetable market;television;Box office;ram pothineni;Success;Prabhas;India;Guntur;mahesh babu;Cinemaఈసారి ఫ్యాన్స్ ని ఘోరంగా నిరాశపరిచిన సలార్?ఈసారి ఫ్యాన్స్ ని ఘోరంగా నిరాశపరిచిన సలార్?Prabhas{#}Payal Rajput;krishnam raju;Kesari;vegetable market;television;Box office;ram pothineni;Success;Prabhas;India;Guntur;mahesh babu;CinemaFri, 03 May 2024 18:51:00 GMTపాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు అందుకున్న తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్.. ఆయన హీరోగా వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ కి ఇప్పుడు అన్ని వైపులా మార్కెట్ పరిధి  పెరుగుతూ ఉంది.ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా 150 కోట్ల వరకు వచ్చిన విషయం తెలిసిందే.ఒకవైపు తియేట్రికల్ గా మరొకవైపు నాన్ థియేట్రికల్ గా ప్రభాస్ బిజినెస్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఉండే అవకాశం  ఉంది. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్లో మొదట ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో బాగానే అందుకున్నప్పటికీ వారం తరువాత మాత్రం రికార్డు స్థాయిలో అయితే కలెక్షన్స్ పెద్దగా రాబట్టలేకపోయింది.కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ మూవీతో కాస్త సంతృప్తి చెందారు. వరుస ప్లాప్స్ తరువాత ఈ సినిమా ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్నయితే ఇచ్చింది. అయితే ఇలాంటి సినిమాలు టీవీలో వస్తే తప్పకుండా TRP రికార్డులు బ్లాస్ట్ చేయడం పక్కా అని అభిమానులు అందరూ అనుకున్నారు కానీ ఊహించిన విధంగా ఈ సినిమా టాప్ లిస్టులో ఉన్న ఏ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేయలేకపోవడం కాదు కదా కనీసం ఆ సినిమాల దారిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.రీసెంట్ గా ఈమధ్య కాలంలో వచ్చిన కొత్త సినిమాలలో భగవంతు కేసరి సినిమా మొదటిసారి టెలికాస్ట్ ఆయినప్పుడు ఏకంగా 9.36 టిఆర్పి అందుకుంది.


ఇక ఆ తర్వాత దాదాపు అదే రేంజ్ లో గుంటూరు కారం 9.23 రేంజ్ లో TRP సొంతం చేసుకుంది. గుంటూరు కారం తరువాత ఇక నా సామీ రంగా సినిమాకు 8.15 టిఆర్పి రాగా పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమాకు 8.3 టిఆర్పి దక్కింది. థియేటర్లో అంతగా సక్సెస్ కాలేకపోయినా రామ్ స్కంద సినిమా కూడా ఏకంగా 8.5 టిఆర్పి రేటింగ్ అందుకోవడం విశేషం. అయితే టిఆర్పి విషయంలో టాప్ 5 లో నిలిచిన ఈ సినిమాలలో ఒక్క గుంటూరు కారం సినిమా తప్ప ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రికార్డులు  క్రియేట్ చేయలేదు. గుంటూరు కారం కేవలం మహేష్ బాబు స్టామినా వల్ల 200 కోట్ల పైగా వసూలు చేసింది తప్ప పెద్దగా చెప్పుకునే టాక్ అయితే రాలేదు.కానీ సలార్ వాటి కంటే మంచి హిట్ టాక్ అందుకొని పైగా వాటి కంటే ఎక్కువ కలెక్షన్స్ దాదాపు 600 కోట్ల దాకా అందుకున్నప్పటికి టీవీలో మాత్రం తక్కువ రెస్పాన్స్ అందుకుంది. ఇటీవల మొదటిసారి టెలివిజన్ లో ప్రసారం కాగా కేవలం. 6.5 టిఆర్పి అందుకోవడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టెలివిజన్ మార్కెట్లో ప్రభాస్ కు చాలా మంచి క్రేజ్ ఉంది. కానీ సలార్ సినిమా కనీసం అట్టర్ ప్లాప్ స్కంద రికార్డును కూడా బ్రేక్ చేయకపోవడం షాక్ అనే చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>