MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg సూపర్ స్టార్ మహేష్ బాబు బావ ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సుధీర్ బాబు తన నటన పరంగా అదేవిధంగా తన లుక్ పరంగా తన విషయంలో ఎన్నో మార్పులు చేసుకుని ఎంతో కష్ట పడుతున్నప్పటికీ హీరోగా అతడు సెటిల్ అవ్వలేకపోతున్నాడు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. ‘ప్రేమ కథా చిత్రం’ మూవీ హిట్ అవ్వడంతో సుధీర్ బాబు కెరియర్ ఒక మలుపు తిరిగింది.ఆతరువాత వచ్చిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ‘సమ్మోహనం’ ‘నన్ను దోచుకుందువటే’ మూవీలు వరసగా హిట్ అవ్వడంతో మీడియం రేంజsudheerbabu{#}krishna;sudheer babu;Athadu;mahesh babu;vegetable market;Girl;Cinemaసుధీర్ బాబు అంతర్మధనం !సుధీర్ బాబు అంతర్మధనం !sudheerbabu{#}krishna;sudheer babu;Athadu;mahesh babu;vegetable market;Girl;CinemaFri, 03 May 2024 09:00:00 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు బావ ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సుధీర్ బాబు తన నటన పరంగా అదేవిధంగా తన లుక్ పరంగా తన విషయంలో ఎన్నో మార్పులు చేసుకుని ఎంతో కష్ట పడుతున్నప్పటికీ హీరోగా అతడు సెటిల్ అవ్వలేకపోతున్నాడు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. ‘ప్రేమ కథా చిత్రం’ మూవీ హిట్ అవ్వడంతో సుధీర్ బాబు కెరియర్  ఒక మలుపు తిరిగింది.


ఆతరువాత వచ్చిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ‘సమ్మోహనం’ ‘నన్ను దోచుకుందువటే’ మూవీలు వరసగా హిట్ అవ్వడంతో మీడియం రేంజ్ హీరోగా అతడు సెటిల్ అవ్వడం ఖాయం అని అందరు అనుకున్నారు. అయితే ఆతరువాత అతడు నటించిన సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారడంతో అతడి మార్కెట్ బాగా దెబ్బతింది అని అంటున్నారు.

‘వి’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ‘హంట్’ ‘మామా మశ్చీంద్ర’ ఇలా అతడు నటించిన సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారుతున్నాయి. దీనితో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘హరోంహర’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి అయిన మే 31న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటనతో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అయితే ఈ ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆమూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారలేకపోయింది. వాస్తవానికి ‘హరోoహర’ మూవీలో సుధీర్ బాబు లుక్ చాల డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఆ లుక్ కోసం చాల కష్టపడ్డాడు అన్నవార్తలు వచ్చాయి. దీనికితోడు ఈ మూవీ టీజర్ కూడ చాల డిఫరెంట్ గా కనిపిస్తోంది. దీనితో ఈసినిమా సక్సస్ తో అయినా సుధీర్ బాబు మళ్ళీ ట్రాక్ లోకి రాగలుగుతాడా అన్న అంచనాలు కొందరిలో ఉన్నాయి..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>