PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-202468303288-730a-460a-964e-3f1677d13bdd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-202468303288-730a-460a-964e-3f1677d13bdd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కాపులు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండి అండగా నిలబెడుతున్నారు. అప్పట్లో కూటమిగా బరిలో ఉన్న టీడీపీ-బీజేపీకి పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను పెట్టుకున్నా.. పోటీలో లేకుండా కాపులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన చెప్పినట్టుగా కాపులు.. టీడీపీకి తమ మద్దతు ప్రకటించారు.దాని ఫలితంగా కాపుల బెల్టు ఎక్కువగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధించి 2014లో అధికారంలోకి వచ్చింది.కానీ 2019 ఎన్నికలలో మాత్రం సీన్ మారింది. 2014-19 మధ్య జరిగిన కాపు ఉద్యమం, ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోAP Elections 2024{#}Godavari River;Nara Lokesh;Tadepalli;Petta;West Godavari;Prime Minister;Government;Yevaru;CBN;Hanu Raghavapudi;Pawan Kalyan;News;Party;kalyan;Janasena;YCP;TDP;Jaganకూటమిని నిలబెడుతున్న ఆ సామాజిక వర్గం?కూటమిని నిలబెడుతున్న ఆ సామాజిక వర్గం?AP Elections 2024{#}Godavari River;Nara Lokesh;Tadepalli;Petta;West Godavari;Prime Minister;Government;Yevaru;CBN;Hanu Raghavapudi;Pawan Kalyan;News;Party;kalyan;Janasena;YCP;TDP;JaganFri, 03 May 2024 13:41:09 GMTప్రస్తుతం కాపులు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండి అండగా నిలబెడుతున్నారు. అప్పట్లో కూటమిగా బరిలో ఉన్న టీడీపీ-బీజేపీకి పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను పెట్టుకున్నా.. పోటీలో లేకుండా కాపులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన చెప్పినట్టుగా కాపులు.. టీడీపీకి తమ మద్దతు ప్రకటించారు.దాని ఫలితంగా కాపుల బెల్టు ఎక్కువగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధించి  2014లో అధికారంలోకి వచ్చింది.కానీ 2019 ఎన్నికలలో మాత్రం సీన్ మారింది. 2014-19 మధ్య జరిగిన కాపు ఉద్యమం, ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోవడంతో ఆ ఎన్నికల్లో కాపులు వైసీపీకి అండగా జగన్ కి జై కొట్టారు. అందువల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాపులు ఎటువైపు నిలుస్తారనేది అందరికీ ఎంతో ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. కొన్నాళ్ల కిందటి దాకా తటస్థంగా ఉన్న కాపులు.. ఇటీవల కాలంలో జనసేన వైపు ఎంతగానో మొగ్గు చూపుతున్నారు.అందుకే ప్రస్తుత ఎన్నికల్లో కూటమికి కాపులు తమ మద్దతు ఇస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బలంగా నిలబడడం.. వైసీపీపై పోరాటం చేస్తుండడంతోపాటు.. మెగా కుటుంబం మొత్తంగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం.. కాపులకు ఎంతో ఉత్సాహంగా ఉంది.


పైగా.. కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకమనే ప్రచారాన్ని టీడీపీ సహా.. పవన్ కూడా బాగా చెబుతున్నారు. ఇక, సీట్లు తగ్గాయన్న ఆవేదన ఉన్నా.. ఎందుకు తగ్గించుకున్నారనే వివరణకు కూడా వారు సంతృప్తి చెందారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ ఈ సారి తనను గెలిపించాలని కోరుతుండడం కాపులకు సెంటిమెంటుగా మారింది.మరోవైపు.. కూటమిలోనే కాకుండా.. టీడీపీలో కూడా పవన్‌కు ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు తర్వాత.. ఎవరు అంటే.. నిన్న మొన్నటి దాకా ఆయన కుమారుడు నారా లోకేష్ పేరు వినిపించింది. కానీ ఈమధ్య కాలంలో నారా లోకేష్‌ను కూడా తప్పించి.. తగ్గించి.. పవన్‌ కళ్యాణ్ కు ప్రాధాన్యత పెంచుతున్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కూడా గతంలో జరిగిన తాడేపల్లి గూడెం ఉమ్మడి సభలోనూ, ప్రధాని పాల్గొన్న చిలకలూరి పేట సభలో కూడా నారా లోకేష్‌ను తప్పించారు. ఈ స్థానంలో పవన్‌ కళ్యాణ్ ను చేర్చారు. అందుకు కారణం పవన్ వల్ల కూటమికి కాపుల నుంచి సపోర్ట్ వస్తుందని. ఇలా కాపులు ఈసారి కూటమిని నిలబెడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>