Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/police-54fb34c6-d72b-4f67-9a4a-d06281f974fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/police-54fb34c6-d72b-4f67-9a4a-d06281f974fc-415x250-IndiaHerald.jpgసాధారణంగా దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లో ఎలా అయితే సైనికులు రాత్రి పగలు అని తేడా లేకుండా పహార కాస్తూ ఉంటారో.. ఇక దేశం నడిబొడ్డులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు అంతే కష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేరాలను అరికట్టేందుకు కొన్ని కొన్ని సార్లు పోలీసులు సాహసాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా నేరస్తులకు కూడా ఏదైనా నేరానికి పాల్పడితే పోలీసులు తమను కఠినంగా శిక్షిస్తారు అనే భయం ఎప్పటికీ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే పోలీసుల కళ్ళు గప్పి దొంగతనాలు చేస్తున్న కేటుగాళPolice.{#}Police Station;Traffic police;police;Kurnoolపోలీసే దొంగ.. స్టేషన్ లో చోరీ.. చివరికి?పోలీసే దొంగ.. స్టేషన్ లో చోరీ.. చివరికి?Police.{#}Police Station;Traffic police;police;KurnoolThu, 02 May 2024 12:00:00 GMTసాధారణంగా దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లో ఎలా అయితే సైనికులు రాత్రి పగలు అని తేడా లేకుండా పహార కాస్తూ ఉంటారో.. ఇక దేశం నడిబొడ్డులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు అంతే కష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేరాలను అరికట్టేందుకు కొన్ని కొన్ని సార్లు పోలీసులు సాహసాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా నేరస్తులకు కూడా ఏదైనా నేరానికి పాల్పడితే పోలీసులు తమను కఠినంగా శిక్షిస్తారు అనే భయం ఎప్పటికీ ఉంటుంది.


 ఇక ఈ మధ్యకాలంలో అయితే పోలీసుల కళ్ళు గప్పి దొంగతనాలు చేస్తున్న కేటుగాళ్లు ఎక్కువైపోతున్నారు. దీంతో ఇంటికి తాళం వేసి వెళ్ళాలి అంటేనే యజమానులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా ఎక్కడైనా దొంగతనం జరిగింది అంటే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటారు. చివరికి ఎంతో కష్టపడి దొంగను పట్టుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఏదో ఒక ఇంట్లో దొంగతనం జరిగితే దొంగను పోలీసులు పట్టుకోవడం కామన్.


కానీ ఏకంగా నేరాలను అరికట్టే పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే.. అది కూడా ఏకంగా పోలిసే దొంగగా మారితే.. అది నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే విషయమే కదా. ఏపీలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హోంగార్డు పోలీస్ స్టేషన్ లోనే చేతివాటం చూపించి చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు మనోజ్. ఇటీవల దొంగతనం చేశాడు. నకిలీ తాళంతో బీరువాలోని 5.63 లక్షల రూపాయలు కాజేసాడు. అదంతా వివిధ కేసుల్లో పట్టుబడ్డ నగదు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.   అతని నుంచి మూడు లక్షలు రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>