Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elecfions1e38308c-592a-447f-9209-19f8ccda425f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elecfions1e38308c-592a-447f-9209-19f8ccda425f-415x250-IndiaHerald.jpgఅధికారం కోసం హామీలు కురిపించే నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోతూ ఉంటారు. ఇదంతా సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నిజం అవుతూ ఉంటుంది. పాలకులు మారితే తమ బతుకులు మారుతాయి అనుకుంటున్నా ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజల పరిస్థితి ఇలాగే మారిపోయింది. అక్కడ ఎప్పుడు పాలకులు మారుతున్న ఇక హైదరాబాద్ ప్రజల పరిస్థితిని మాత్రం మారడం లేదు. ఎండాకాలంకి వచ్చిందంటే చాలు నీటి కొరతతో బాధపడటం.. ఇక వానాకాలం వచ్చిందంటే చాలు వరదలతో ఇల్లు మునిగిపోElecfions{#}Nijam;Varsham;Aqua;Party;Hyderabad;Congress;House;Telanganaపేరుకే భాగ్యనగరం.. పాలకులు మారుతున్న వరదలు ఆగడం లేదు?పేరుకే భాగ్యనగరం.. పాలకులు మారుతున్న వరదలు ఆగడం లేదు?Elecfions{#}Nijam;Varsham;Aqua;Party;Hyderabad;Congress;House;TelanganaThu, 02 May 2024 11:30:00 GMTఅధికారం కోసం హామీలు కురిపించే నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోతూ ఉంటారు. ఇదంతా సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నిజం అవుతూ ఉంటుంది. పాలకులు మారితే తమ బతుకులు మారుతాయి అనుకుంటున్నా ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజల పరిస్థితి ఇలాగే మారిపోయింది. అక్కడ ఎప్పుడు పాలకులు మారుతున్న ఇక హైదరాబాద్ ప్రజల పరిస్థితిని మాత్రం మారడం లేదు.


 ఎండాకాలంకి వచ్చిందంటే చాలు నీటి కొరతతో బాధపడటం.. ఇక వానాకాలం వచ్చిందంటే చాలు వరదలతో ఇల్లు మునిగిపోవడం ఇదే అక్కడ ప్రజల జీవన విధానంగా మారిపోయింది. అయితే పాలకులు మారితే కనీసం నాలాలను బాగు చేయించి హైదరాబాద్లో వరదలు రాకుండా చూస్తారని అటు ఎన్నోసార్లు ఆశలు పెట్టుకున్నారు హైదరాబాద్ ప్రజలు. అయితే మేం చేసిన అభివృద్ధిని ఎవరూ చేయలేదు అని అందరూ సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప పాలకులు మారుతున్న హైదరాబాద్ నగర పరిస్థితి మాత్రం మారడం లేదు.


 వర్షాకాలం ముందు వరకు కూడా ఎటు చూసినా అద్దాలమేడలు కనిపించే భాగ్య నగరం చినుకు పడితే చాలు మొత్తం చిత్తడిగా మారిపోతుంది. కాస్త భారీ వర్షం కురిసింది అంటే చాలు కాలనీలన్నీ కూడా వరద నీటితో నిండిపోతూ ఉంటాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ పాలకులు మాత్రం పట్టించుకోవట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అయినా అటు హైదరాబాద్ నగరంలో వరదలు రావు పరిస్థితులు మారిపోతాయ్ అనుకున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది పరిస్థితి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హస్తం పార్టీ ప్రభుత్వమైన ఇలా వరదల సమస్యను తీరుస్తుందా లేదా అన్నది అందరిలో ఉన్న ఒక అనుమానం. ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>