PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-the-leaders-listen-to-the-lesson-kcr-is-teachingc6b56318-c639-4b57-b731-2ee877579e53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-the-leaders-listen-to-the-lesson-kcr-is-teachingc6b56318-c639-4b57-b731-2ee877579e53-415x250-IndiaHerald.jpgతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ ఎస్ అధినేత‌.. రాజ‌కీయాల‌కు రాజ‌కీయాలు నేర్ప‌గ‌ల నేర్ప‌రి.. ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక కీల‌క పార్టీ అధినేత‌ను ప్ర‌చారానికి 48 గంట‌ల పాటు ఎన్నిక‌ల సంఘం స‌స్పెండ్ చేయ‌డం.. ఎక్క‌డా నోరు విప్ప‌కుండా తాళం వేయ‌డం సంచ‌ల‌న‌మే. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల తీరు కూడా అలానే ఉంది. అధికార ప‌క్ష నాయ‌కుల‌ను ఆయ‌న గేలిచేసిన తీరు కూడా అభ్యంత‌ర క‌రంగానే ఉంది. `అవివేకులు, అర్భ‌కులు, అస‌మ‌ర్తులు, చ‌వ‌ట‌లు, ద‌ద్ద‌మ్మ‌లు, కుక్క‌ల కొడుకులు, ప‌నికిAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; kcr;Revanth Reddy; Telangana elections {#}Chitram;Party;KCR;Cinema;Election Commission;Thief;Donga;YCP;TDPకేసీఆర్ నేర్పుతున్న పాఠం.. నేత‌లు వింటారా..?కేసీఆర్ నేర్పుతున్న పాఠం.. నేత‌లు వింటారా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; kcr;Revanth Reddy; Telangana elections {#}Chitram;Party;KCR;Cinema;Election Commission;Thief;Donga;YCP;TDPThu, 02 May 2024 15:30:10 GMTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ ఎస్ అధినేత‌.. రాజ‌కీయాల‌కు రాజ‌కీయాలు నేర్ప‌గ‌ల నేర్ప‌రి.. ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక కీల‌క పార్టీ అధినేత‌ను ప్ర‌చారానికి 48 గంట‌ల పాటు ఎన్నిక‌ల సంఘం స‌స్పెండ్ చేయ‌డం.. ఎక్క‌డా నోరు విప్ప‌కుండా తాళం వేయ‌డం సంచ‌ల‌న‌మే. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల తీరు కూడా అలానే ఉంది. అధికార ప‌క్ష నాయ‌కుల‌ను  ఆయ‌న గేలిచేసిన తీరు కూడా అభ్యంత‌ర క‌రంగానే ఉంది.

`అవివేకులు, అర్భ‌కులు, అస‌మ‌ర్తులు, చ‌వ‌ట‌లు, ద‌ద్ద‌మ్మ‌లు, కుక్క‌ల కొడుకులు, ప‌నికిమాలిన వారు, నిరోధ్‌లు, పావుడాలు అమ్ముకునే వారు, దొంగ నా కొడుకులు... మెడ కొరికి చంపుతా`- అంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎన్నిక‌ల సంఘం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఇవి ప్ర‌జాస్వామ్యంలో స‌రికాద‌ని చెప్పి ఊరుకోలేదు. కేసీఆర్ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఆప్‌లైన్‌, ఆన్‌లైన్‌లోనూ ప్ర‌చారం చేయ‌డానికి.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించడానికి కూడా నిషేధం విధించింది.

క‌ట్ చేస్తే.. ఏపీలోనూ కేసీఆర్ త‌ర‌హా మాట‌లే వినిపిస్తున్నాయి. దీనిలో ఏ పార్టీ ప్రాత్రం ఎంత అంటే.. ఏదీ త‌క్కువ‌గా లేద‌నే చెప్పాలి. వైసీపీ నుంచి టీడీపీ, జ‌న‌సేనల నుంచి కూడా ఇలాంటి క‌న్నా ఎక్కువ‌గానే మాట‌ల తూటాలు పేలుతున్నాయి. గొడ్డ‌లి, బాబాయి హ‌త్య‌, న‌ర‌హంత‌కుడు, దుర్మార్గుడు, దోపిడీ దారు, దొంగ‌ల‌ముఠా స‌హా సైకో, జ‌గ్‌ల‌క్‌, జ‌గ్గూ భాయి, దావూద్ ఇబ్ర‌హీం.. ఇలా ఇంకా ఎన్నెన్నో మాటలు జ‌న‌సేన‌, టీడీపీ అధినేతల నుంచి వినిపిస్తున్నాయి.

ఇక‌, వైసీపీ కూడా.. చంద్ర‌బాబు దుర్మార్గుడు, దుష్టుడు, లక‌ల‌క‌ల‌క‌, ప‌శుప‌తి వంటివ్యాఖ్య‌లు వినిపిస్తున్నా యి. మొత్తంగా చూస్తే..ఈ రెండు ప‌క్షాల మ‌ధ్య కూడా.. మాట‌లు ముదురుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇరు ప‌క్షాల నాయ‌కుల‌కు కూడా.. ఈసీ ఇప్ప‌టికే.. నోటీసులు జారీ చేసింది. అయినా..తీరు మార‌లేదు. మ‌రో 10 రోజుల పాటు ప్ర‌చారానికి స‌మ‌యం ఉంది. ఈలోగా అయినా.. ఈ వ్యాఖ్య‌లు మానుకోక‌పోతే.. మ‌రో కేసీఆర్ వంటి వ్య‌క్తులు చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌లో ఏవరైనా బాధితులు కావాల్సిందే. సో.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తే.. అన్నిపార్టీల‌కూ మంచిద‌ని అంటున్నారు మేధావులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>