PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasenac937c69b-b5d0-40ae-b799-97441b7ff970-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasenac937c69b-b5d0-40ae-b799-97441b7ff970-415x250-IndiaHerald.jpgఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య పోరు చాలా ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అవును, కూటమి - వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సమరం కొనసాగుతోంది. మేనిఫెస్టోలు వెల్లడైన నేపథ్యంలో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఈ సమయంలోనూ మరీ ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాసు పై కొత్త చర్చ మొదలైంది. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయంతో కూటమి నేతలలో మిక్కిలి ఆందోళన మొదలైంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా పేర్కొనటంతో పలువురు స్వతంత్ర అభ్యర్దులకు ఎన్నికల సంఘం జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో కేటాయించడం జరిగింది.janasena{#}Varla Ramaiah;Rajampet;meena;Parliment;High court;Election Commission;Army;MP;YCP;Janasena;TDPఏపీ: ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతో ఇబ్బంది తప్పదా?ఏపీ: ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతో ఇబ్బంది తప్పదా?janasena{#}Varla Ramaiah;Rajampet;meena;Parliment;High court;Election Commission;Army;MP;YCP;Janasena;TDPThu, 02 May 2024 14:04:00 GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య పోరు చాలా ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అవును, కూటమి - వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సమరం కొనసాగుతోంది. మేనిఫెస్టోలు వెల్లడైన నేపథ్యంలో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఈ సమయంలోనూ మరీ ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాసు పై కొత్త చర్చ మొదలైంది. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయంతో కూటమి నేతలలో మిక్కిలి ఆందోళన మొదలైంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా పేర్కొనటంతో పలువురు స్వతంత్ర అభ్యర్దులకు ఎన్నికల సంఘం జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో కేటాయించడం జరిగింది. అయితే దీని పైన ఎన్డీఏ పార్టీలు ఎన్నికల సంఘం, కోర్టును ఆశ్రయించాయి. ఆ తరువాత ఎన్నికల సంఘం తమ నిర్ణయంలో సవరణలు చేయడం జరిగింది.

అసలు విషయం లోకి వెళితే, జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాలతో పాటుగా, మొత్తం 13 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో జనసేన పోటీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో విజయనగరం, విశాఖ, అరకు, అనకాపల్లి, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం, బందరు, తిరుపతి, గుంటూరు, రాజంపేట లోక్ సభ స్థానాల్లో కూటమికి గాజు గ్లాస్ గండం తప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 13 పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుని జనసేనకే ఫ్రీజ్ చేసిన ఈసీ మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ఫ్రీ సింబల్ గానే కొనసాగించడం ఇపుడు టెన్షన్ పట్టుకున్న అంశం.

ఈ మేరకు సింబల్ కేటాయింపుల్లో మార్పులు చేయాలని ఆర్వోలకు సీఈఓ మీనా ఆదేశించడం జరిగింది. కాగా ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్డీఏ కూటమి నేతలు అప్రమత్తం అయినట్టు కనబడుతోంది. తాగాజా టీడీపీ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వేరే ఎవరికి కేటాయించవద్దనీ అత్యవసర పిటిషన్లో న్యాయస్థానాన్ని టీడీపీ నేతలు కోరడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జన సేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా గాజు గ్లాసు గుర్తును జన సేనకే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో అభ్యర్ధన ఇవ్వగా టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన ఈ పిటీషన్ ను ఈ రోజు హైకోర్టు విచారణ చేయనుంది. తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే కూటమి ఓట్ల బదిలీలో నష్టం జరిగే అవకావం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>